వైసీపీ క్యాడర్ ధైర్యంగా ఉంటే జగన్ ఎందుకు భయపడుతున్నారు ?

కట్ చేస్తే వైసీపీ లో అంతా ఇపుడు రివర్స్ లో ఉందని అంటున్నారు చిత్రంగా కొత్త సీన్ వైసీపీలో కనిపిస్తోంది ఒక వైపు ఏమో వైసీపీ క్యాడర్ ఏమో ఢీ అంటే ఢీ అనే విధంగా గ్రౌండ్ లెవెల్ లో గట్టిగానే నిలబడుతున్నారు.;

Update: 2025-09-18 17:30 GMT

వైసీపీలో భయం ఎవరికి అయినా ఉందా అంటే లేదు అన్న జవాబు వస్తుంది. వైసీపీ నాయకులు అయినా క్యాడర్ అయినా తమ గొంతును బలంగా వినిపిస్తారు. వెన్ను చూపి వెనక్కి పోయే నైజం వైసీపీలో అధినాయకుడికే లేదు అని అంటారు. కేంద్రంలో రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలోనే ఆ కాంగ్రెస్ ని ఎదిరించి మరీ బయటకు వచ్చిన వారు జగన్. ఏకంగా అయిదేళ్ల పాటు కాంగ్రెస్ తో ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీతో పోరాడి మరీ చిచ్చర పిడుగు మాదిరిగా ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో తన రాజకీయ ప్రభావాన్ని ప్రతాపాన్ని నిండుగా మెండుగా చూపించిన వారు వైఎస్ జగన్ అని ఎవరైనా అంటారు. జగన్ లో పట్టుదల ఉందా మొండితనం ఉందా లేదా దూకుడు ఉందా అంటే అన్నీ కలిసే ఉన్నాయని చెబుతారు. ఇవన్నీ కలసి జగన్ అంటే భయానికే భయం అని కూడా చెబుతారు. జగన్ పొలిటికల్ డిక్షనరీలో కానీ పర్సనల్ హిస్టరీలో కానీ భయం అన్న మూడక్షరాలకు ఎపుడూ ప్లేస్ లేదని కూడా అంటారు.

ఢీ అంటే ఢీ అంటూ :

కట్ చేస్తే వైసీపీ లో అంతా ఇపుడు రివర్స్ లో ఉందని అంటున్నారు చిత్రంగా కొత్త సీన్ వైసీపీలో కనిపిస్తోంది ఒక వైపు ఏమో వైసీపీ క్యాడర్ ఏమో ఢీ అంటే ఢీ అనే విధంగా గ్రౌండ్ లెవెల్ లో గట్టిగానే నిలబడుతున్నారు. ఓటమి నుంచే గెలుపు రుచిని అందుకోవాలని ఆరాటపడుతున్నారు జరిగింది గతం చూసేది బలమైన భవిష్యత్తు అని కూడా నమ్ముతున్నారు. అందుకే పదిహేను నెలల కూటమి పాలనలో తాము ఏ విధంగా నలిగిపోయింది రగిలిపోతున్నది అన్నీ చూసుకుని బేరీజు వేసుకుని మరీ జనంతోనే రాజకీయ కధని తేల్చుకోవాలని చూస్తున్నారు. వారికి కళ్ళ ముందు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లోకి దిగి తమ సత్తా చాటుకోవాలని కూడా చూస్తున్నారు అని టాక్.

జగన్ ఎందుకు అలా :

ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిజల్ట్ చూసి జగన్ ఆలోచనలు మారాయని అని అంటున్నారు. ఒక విధంగా స్థానిక ఎన్నికలు కూడా దీనికి డిటో గానే ఉంటాయని ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో ఎలక్షన్స్ అన్నది చేయనీయకుండా టీడీపీ కూటమి చేసింది కాబట్టి రాష్ట్రం అంతటా అలాగే చేస్తారు అని జగన్ భయపడుతున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నపుడు జగన్ కూడా స్థానిక ఎన్నికల్లో అలాగే చేశారు కదా అన్నది కూడా మేధావుల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి మరో వైపు వినిపిస్తున్న మాట గా ఉంది. ఆఖరుకు కుప్పంలో కూడా జగన్ మార్క్ ఎలక్షన్స్ జరిపి చంద్రబాబుకు చుక్కలు చూపించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఆనాడు ఎన్నికలు చేయనీయకుండా టీడీపీని వైసీపీ ఎలా అడ్డుకుందో కూడా అంతా గుర్తు చేసుకుంటున్నారు

వై నాట్ 175 స్లోగన్ :

నిజానికి వై నాట్ 175 అన్న స్లోగన్ కూడా కుప్పం ఎన్నికల తరువాతనే పుట్టింది అని చెబుతారు. అధికారం చేతిలో ఉంది కాబట్టే కుప్పంలో గెలిచామన్నది వైసీపీ నేతలకు సోయి లేకపోయింది అని కూడా అంటారు. అందుకే అన్నీ గెలిచేశామని భ్రమపడి వై నాట్ 175 అనేశారు. కానీ టైటిల్ సూపర్ హిట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అన్నట్లుగా ఈ స్లోగన్ తయారైంది అన్నది 2024 ఎన్నికల ఫలితాల తరువాతనే తెలిసింది మరి అని సెటైర్లూ పడ్డాయి.

కేంద్ర బలగాలు ఎందుకు :

ఇక లోకల్ బాడీ ఎన్నికలు అన్నవి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది రాష్ట్ర పోలీసులే ఈ ఎన్నికల్లో బందోబస్తు చూస్తారు. దీనికి కేంద్ర బలగాలు ఎందుకు వస్తాయి అని అంటున్నారు కేంద్ర బలగాలు వస్తే ఎన్నికలు సాఫీగా సాగుతాయని జగన్ అంటున్నారు కానీ ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా స్టేట్ పోలీస్ నే ఎన్నికలు నిర్వహించాయి అన్నది మరచిపోతే ఎలా అని అంటున్నారు.

మోడీకి జై కొట్టినా :

ఇక ఎన్డీయే అభ్యర్ధికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి జగన్ రాజకీయంగా తన రాంగ్ రూట్ ని ఎంచుకున్నారా అని కూడా అంటున్నారు. కేంద్ర బలగాలు అని అన్నా కూడా కేంద్రంలో ఉన్నది ఎన్డీయే కదా అని అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో చూస్తే ఎ ఎన్డీయే లో భాగంగా ఉంది. వారు కూటమికే మద్దతుగా ఉంటారు కానీ జగన్ కి ఎందుకు సపోర్ట్ గా ఉంటారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే జగన్ ఇండియా కూటమిలో ఉంటే కచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మద్దతు జగన్ కి దక్కేది అని కూడా విశ్లేషిస్తున్నారు. కానీ వైసీపీ అనేది చెప్పేది ఏంటి అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తమ పార్టీ పుట్టింది కాబట్టి ఆ పార్టీతో ఎలా కలుస్తుంది అని. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎపుడూ ఒకేలా ఉండవు. 2011లోనే వైసీపీ ఉండిపోతే ఎలా అన్న చర్చ వస్తోంది. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్డీయేకు ఎంతగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సపోర్టు చేసినా ఫలితం అయితే ఉండదని అంటున్నారు

క్యాడర్ కోసమైనా సరే :

ఇవన్నీ పక్కన పెడితే ప్రతీ ఎన్నిక ఒక యుద్ధం. ప్రతీ ఎన్నిక ఒక గుణ పాఠం. అందువల్ల ఎన్నికల్లో వైసీపీ పాల్గొనాల్సిందే అన్న మాట అయితే వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటేనే గెలుపు అయినా ఓటమి అయినా వైసీపీ క్యాడర్ పార్టీకి బలంగా ఉంటుంది. పైగా వారిలో కూడా ఒక పోరాట స్పూర్తి వస్తుంది. అది ముందు ముందు ఎన్నికలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అలా కాకుండా బాయ్ కాట్ అన్న నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీకి అది రాజకీయంగా ఇబ్బందులను తెచ్చే పరిణామమే అని అంటున్నారు చేజేతులా గివ్ అప్ ఇచ్చేసినట్లు అవుతుందని ఆ మీదట వగచి వాపోయినా ఫలితం ఉండదని కూడా అంటున్నారు. మొత్తానికి క్యాడర్ కోసం వారిని ఉత్తేజం చేయడం కోసం పార్టీ కోసం జగన్ కచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పాల్గొనాల్సిందే అన్న మాట అయితే ఇపుడు వైసీపీలో వినిపిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News