జగన్ కంటే ముందే రంగంలోకి షర్మిల !

వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావడం లేదు. జిల్లాలలో పర్యటిస్తాను అని ఆయా చెప్పినా ఇంతవరకూ ఆది ఆచరణలోకి రాలేదు.;

Update: 2025-05-05 04:24 GMT

వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావడం లేదు. జిల్లాలలో పర్యటిస్తాను అని ఆయా చెప్పినా ఇంతవరకూ ఆది ఆచరణలోకి రాలేదు. ఆయన ఎపుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియదు కానీ అన్న కంటే చెల్లెలు ముందుగా రెడీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలకు రెడీ అయిపోయారు.

ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్ ని కూడా ప్రకటించారు. ఏపీలో ఈ నెల 9 నుంచి షర్మిల జిల్లా పర్యటనలు మొదలు కానున్నాయి. తిరుపతి నుంచి ఆమె మొదలుపెట్టి విశాఖలో ముగించేలా ఈ పర్యటనల షెడ్యూల్ ని ఖరారు చేఆరు.

తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్‌ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో షర్మిల పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన ఏడాదికి దగ్గర పడడంతో ప్రజా స్పందనను తెలుసుకుని దానిని పార్టీ బలోపేతానికి వాడుకోవాలని షర్మిల చూస్తున్నారు. ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ అయితే జనంలోకి పోవడం లేదు. పార్టీ నాయకులకు మొత్తం బాధ్యతలు అప్పగించిన జగన్ వారు జనంలో ఉండాలని కోరినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

జగన్ అయితే ఎపుడు తాను జనంలోకి వస్తారో కూడా తెలియడం లేదు ఆయన కేసీఆర్ మాదిరిగా ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశాలు లేవు అని అంటున్నారు కేసీఆర్ అయితే తన కుమారుడు కేటీఆర్ ని జనంలో ఉంచుతున్నారు అలాగే మేనల్లుడు హరీష్ రావు కూడా ప్రజలలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారు దాంతో కేసీఆర్ కి ఇపుడే రావాల్సిన అవసరం లేదు.

అదే జగన్ విషయం తీసుకుంటే ఆయన తప్ప పార్టీలో మరో కీలక నాయకత్వం లేదు దాంతో జిల్లా పార్టీలకు బాధ్యతలు ఇస్తున్నా వారు తీసుకోవడం లేదు పార్టీ అన్నాక నాయకులను క్యాడర్ ని కో ఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆ పని అయితే వైసీపీలో జరగడం లేదు ఒక విధంగా చూస్తే విపక్షం ప్లేస్ ని వైసీపీ పూర్తిగా భర్తీ చేయలేకపోతోంది. దీనిని గమనించిన షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్సార్ చరిష్మాను వాడుకుంటూ జనంలో ఉంటే కనుక కచ్చితంగా కాంగ్రెస్ కి మంచి రోజులు తెప్పించగలమని ఆమె నమ్ముతున్నారు.

ఇక షర్మిల జిల్లా పర్యటనలు అన్నీ కూడా ఆయా జిల్లాలలో సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకం అవుతూ సాగుతాయని అంటున్నారు. వీటికి కనుక ఏ మాత్రం స్పందన వచ్చి క్లిక్ అయినా షర్మిల మరింత ధీటుగా పోరాడుతారు అనడంలో డౌటే లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News