• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ కుండబద్ధలు కొడతారా ?

జగన్ కుండబద్ధలు కొడతారా ?

| ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీకి పునాది లాంటి విజయసాయిరెడ్డి నిష్క్రమించిన అనంతర పరిణామాల మీద చర్చిస్తారు అని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-31 01:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ టూర్ ని ముగించుకుని ఫిబ్రవరి 3న ఏపీకి తిరిగి వస్తున్నారు. ఆయన వస్తూనే 4వ తేదీన కీలకమైన పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీకి పునాది లాంటి విజయసాయిరెడ్డి నిష్క్రమించిన అనంతర పరిణామాల మీద చర్చిస్తారు అని అంటున్నారు.

విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోవడంతో వైసీపీ భారీ కుదుపునకు గురి అయింది. దాంతో పాటు పార్టీ వర్గాలు పూర్తిగా డీలా పడ్డాయి. దాంతో పార్టీకి గట్టి భరోసా ఇవ్వడంతో పాటు వైసీపీని మళ్ళీ పునరుత్తేజం చేయడం మీద కూడా చర్చిస్తారు అని అంటున్నారు.

ఇక విజయసాయిరెడ్డి తనతో చెప్పిన విషయాలను ఏ కారణంగా పార్టీని వీడిపోతున్నది తెలియచేసిన విషయాలను కూడా ఆయన పార్టీ వారితో పంచుకుంటారని అంటున్నారు. ఇక జగన్ చాలా కాలం తరువాత మీడియా ముందుకు కూడా అదే రోజున రాబోతున్నారు అని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి మీద వైసీపీ తరఫున ఆయన ఏమి మాట్లాడుతారో తెలుస్తుంది అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వల్లనే సూపర్ సిక్స్ ని అమలు చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అదే విధంగా వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా విచ్చిన్నం అయింది అని విమర్శించారు.

ఈ రెండు విషయాల మీద మీడియాకు వైసీపీ తరఫున సుదీర్ఘమైన వివరణను ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి. అలాగే 2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర ఆదాయాలు ఆర్ధిక పరిస్థితి మీద జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నరు.

దాంతో పాటుగా సూపర్ సిక్స్ హామీలు చంద్రబాబు నెరవేర్చ కపోవడం మీద కూడా మీడియా ముఖంగా జగన్ ప్రశ్నిస్తారని అంటున్నారు ప్రతీ దానికీ వైసీపీ ప్రభుత్వం కారణం అంటూ అధికార కూటమి చేస్తున్న ప్రచారం మీద ఆయన అసలు వాస్తవాలను గణాంకాలతో సహా కుండబద్ధలు కొడతారు అని అంటున్నారు.

అంతే కాకుండా దాదాపుగా ఎనిమిది నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అభిప్రాయాలను చేయబోయే నిరసన కార్యక్రమాలను వివరిస్తారని అంటున్నారు. మరి మీడియా విజయసాయిరెడ్డి విషయంలో ప్రశ్నలు కనుక అడిగితే దానికి జగన్ ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా దాదాపు నెల రోజుల పాటు ప్రవాసంలో ఉంటూ ఏపీకి జగన్ వస్తున్న క్రమంలో ఆయన కూటమి మీద ఏ విధంగా విమర్శలు చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    
  • YsJagan 
  • Appolitics 
  • VijaySaiReddy 
  • Ycp 
  • Financialpackage 
  • VisakhapatnamSteelPlant 
  • AndhraPradesheconomy 
  • February4meeting 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS