జగన్ పర్యటనలకు పర్మిషన్లు నో ?
ఈ నేపథ్యంలో జగన్ పొదిలి పర్యటన ఘర్షణాత్మకం కావడం పట్ల సీఎం బాబు సీరియస్ అయ్యారు. పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ఇక మీదట పర్మిషన్లు లభిస్తాయా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఒకవేళ లభించినా దానికి ఎన్ని ఆంక్షలు పెడతారు అన్నది మరో ప్రశ్నగా ఉంది. ఇదంతా ఎందుకు అంటే జగన్ బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. పొగాకు రైతులతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్న వైసీపీ శ్రేణులకు టీడీపీకి మధ్య ఘర్షణ జరిగింది. ఇక పోలీసులకు కొందరికి గాయాలు అయ్యాయని అంటున్నారు. అమరావతి మీద తన చానల్ లో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను జగన్ క్షమాపణలు చెప్పాలని మహిళలు డిమాండ్ చేస్తూ ప్లే కార్డులతో నిరసనలు చేశారు. దాంతో వారికి కూడా గాయాలు అయ్యాయని ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో జగన్ పొదిలి పర్యటన ఘర్షణాత్మకం కావడం పట్ల సీఎం బాబు సీరియస్ అయ్యారు. పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించడంపై బాబు ఫైర్ అయ్యారు.
ఇవన్నీ అరాచకాలే అన్నారు. అంతే కాదు మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా అని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోండని ముఖ్యమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశం జారీ చేశారు. రైతుల పరామర్శకు వెళితే జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు అని బాబు ప్రశ్నించారు. వెళ్లింది రైతుల కోసమా లేక దాడుల కోసమా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావులేదని బాబు స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి వైసీపీ నేతలు శాంతి భద్రతల సృష్టిస్తున్నారని అన్నారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇలా అనుమతులను దుర్వినియోగం చేస్తారా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్ పర్యటనలు చూస్తుంటే తన ఉద్దేశం రైతుల సమస్యలు కాదని అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమే అని అర్ధం అవుతుందని అన్నారు.
కేవలం రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. సమస్య ఉంటే నిరసనలు తెలపడానికి, పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదని, ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదని అన్నారు. అయితే ప్రతి పర్యటనలో వాళ్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది అని బాబు అంటున్నారు.
వాళ్లు ఎక్కడికి వెళ్లాలి అంటే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నామని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తాను అంటే మాత్రం సహించేది లేదు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని బాబు ఆదేశించారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అనుమతులను అలుసుగా తీసుకుంటున్నారని దుర్వినియోగం చేస్తున్నారని బాబు అన్నారు. అరాచకం చేస్తున్నారని అలజడి రేపుతున్నారని అన్నారు. దీనిని బట్టి చూస్తూంటే రానున్న కాలంలో జగన్ పర్యటనలకు అనుమతులు ప్రభుత్వం ఇస్తుందా అన్న చర్చ వస్తోంది.
అదే జరిగితే కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకున్నా అది కూడా ఘర్షణాత్మక మే అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా కేవలం ఏడాది కాలంలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య పొలిటికల్ వార్ బాగా బిగుస్తోంది. ఇది ముందు ముందు ఏ రూపు తీసుకుంటుందో అన్న చర్చ సాగుతోంది.