మావిగన్ సరే.. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏం చేసినట్లు జగన్?

అమరావతి బాగుందా? మావిగన్ బాగుందా? అన్న ప్రశ్నను వేసుకోవానికి చాలామంది సిద్ధంగా లేరు.;

Update: 2026-04-09 07:30 GMT

అమరావతి బాగుందా? మావిగన్ బాగుందా? అన్న ప్రశ్నను వేసుకోవానికి చాలామంది సిద్ధంగా లేరు. ఎందుకంటే.. అమరావతిని ఏపీ రాజధానిగా భావిస్తున్న వారు మావిగన్ ఎంతవరకు వర్కువుట్ అవుతుంది? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న వాదనలో పస ఎంత? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో.. ఏపీ రాజధాని అమరావతి అన్న అంశాన్ని ప్రస్తావించినప్పుడు.. ఆ వాదనలో నిజం ఎంత? నిజంగానే ఏపీకి అమరావతి అవసరం ఎంత ఉందన్న విషయాన్ని చర్చించటం తప్పేం కాదు. వాదన ఏదైనా సరే.. దాని కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు అర్థమవుతాయి.

కానీ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింఫుల్ గా అమరావతి అన్నంతనే అంతెత్తు ఎగిరిపడతారు. అదే సమయంలో మావిగన్ ప్రస్తావన తెచ్చినా.. ఆ ప్లాన్ అమోఘం లాంటి మాటలే తప్పించి.. మూడు రాజధానులకు బదులుగా మావిగన్ అంశాన్ని అప్పట్లో తెర మీదకు ఎందుకు తీసుకురాలేదు? అన్న సూటిప్రశ్నను జగన్ కు వేయాలి కదా? ఆయన చేత సమాధానం చెప్పించాలి కదా? అవేమీ లేకుండా ఏ వాదన వినిపిస్తే.. ఆ వాదనకు ఊ కొడుతూ పోవటం సరైనదేనా? అన్నది ప్రశ్న.

మావిగన్ గురించి గొప్పగా చెబుతున్న వైసీపీ అధినేత జగన్.. కేవలం రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తే..అద్బుతమైన ప్రజా రాజదాని రావటమే కాదు.. విశాలమైన రోడ్లు.. కనెక్టివిటీ మాత్రమే కాదు.. బోలెడెన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయని ఊరిస్తున్నారు జగన్ అండ్ కో. ఇవన్నీ నిజమనే అనుకుందాం. ఇక్కడ వారిని అడగాల్సిన ప్రధానమైన ప్రశ్న మరొకటి ఉంది. ఏపీ వ్యాప్తంగా మావిగన్ గురించి ఇంత గొప్పగా చెబుతున్నారే.. మరి, మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు మూడు రాజధానుల మాటలే చెప్పారే కానీ మావిగన్ వాదన ఎందుకు రాలేదు?

జగన్ చెప్పినట్లుగా రూ.20వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తయ్యే వీలున్నప్పుడు.. ఆ పని ఎందుకు చేయలేదు? అన్నది మరో ప్రశ్న. మొదటి ఏడాదిని పక్కన పెట్టేసినా.. మిగిలిన నాలుగేళ్లలో ఏడాదికి రూ.5 కోట్లు ఖర్చు చేస్తే..ఇప్పుడు చెబుతున్న మావిగన్ ను పూర్తి చేసి ఉండేవారు. తాను చెప్పేది కేవలం మాటల్లోనే కాదు చేతల్లో అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించినా బాగుండేది కదా? అలా ఎందుకు జరగలేదు? అన్నది మరో ప్రశ్న. అమరావతి వద్దని చెబుతున్నోళ్లు.. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో మావిగన్ ను ఒక కొలిక్కి ఎందుకు తీసుకురాలేదన్నది అసలు ప్రశ్న. అదే విషయాన్ని జగన్ కు సూటిగా సంధించే వారెవరు? అన్న దగ్గరే ఆగిపోయే పరిస్థితి. మరి.. అడిగేవారెవరు?

Tags:    

Similar News