• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ సెల్ ఫోన్ కేసులో...

జగన్ సెల్ ఫోన్ కేసులో బిగ్ ట్విస్ట్... సీబీఐకి అలా షాకిచ్చారా..?

| కోర్టు రికార్డుల ప్రకారం.. అవసరమైన అనుమతి పొందిన తర్వాత జగన్ అక్టోబర్ 11న యూరప్‌ కు బయలుదేరారు.

By - Raja Ch
Update: 2025-10-23 10:12 GMT

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన విదేశీ పర్యటన సందర్భంగా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హైదరాబాద్‌ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ నెలకొంది!

అవును... జగన్ తన కుమార్తెలను చూడటానికి అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 30 మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరవుతారని హామీ ఇచ్చారు. ఆ విధంగా కఠినమైన పర్యవేక్షణ నిబంధనలతో అనుమతి మంజూరు చేయబడింది.

కోర్టు రికార్డుల ప్రకారం.. అవసరమైన అనుమతి పొందిన తర్వాత జగన్ అక్టోబర్ 11న యూరప్‌ కు బయలుదేరారు. ఈ సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి ఎటువంటి కోర్టు షరతును ఉల్లంఘించలేదని ఆయన న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు! అయితే సీబీఐ వాదన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

ఈసారి లండన్ టూర్ కు వెళ్లే సమయంలో కోర్టు షరతుల మేరకు సీబీఐకి సమర్పించిన సెల్ ఫోన్ నంబర్ వివాదానికి కారణమైంది. ఇందులో భాగంగా... గతంలో ఇచ్చిన నంబర్ ఒకటి కాగా.. ఈసారి ఇచ్చిన నంబర్ మరొకటి అని చెబుతూ దీనిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. ఆలోపే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని, తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్ మార్చి ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని వాదించింది! అయితే జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది.

ఇందులో భాగంగా... జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు సీబీఐ వాదించగా.. అసలు జగన్ సెల్ ఫోనే వాడటం లేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు. సీబీఐకి అందుబాటులో ఉండేందుకు ఓ మొబైల్ నంబర్ ఇచ్చారని సీబీఐ కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు. దీంతో వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో ఈ నెల 28న తీర్పు ఇస్తామని వెల్లడించారు.

Tags:    
  • YSJagan 
  • CBI 
  • AndhraPolitics 
  • JaganCase 
  • CBICourt 
  • YSJaganNews 
  • BreakingNews 
  • JaganBail 
  • AndhraPradesh 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS