పేటలో వైసీపీ కొంప ముంచే ఫ్యాక్టర్ ?

అయితే వైసీపీ రెండు సార్లు గెలిచిన ఈ సీటుని తాము వదులుకోమని గెలుపు తమదే అని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Update: 2024-04-29 03:35 GMT

జగన్ ఎడా పెడా షిఫ్టులు చేసి పారేశారు. వారిని వీరిని అని చూడకుండా జిల్లాలు సైతం మార్చేసి బదిలీలు ఇచ్చేశారు ఏకంగా ఎనభై మంది దాకా సిట్టింగుల సీట్లలో మార్పులు చేశారు. ఈ మార్పులలో ఏకంగా జిల్లాలు దాటుకుని మరీ పోటీ చేస్తున్న నేతలు ఉన్నారు. అలా శ్రీకాకుళం జిల్లా రాజాం అసెంబ్లీ సీటు నుంచి రెండు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే కంబాల జోగులుని పాయకరావుపేటకు జగన్ షిఫ్ట్ చేశారు.

దీంతో ఎక్కడ రాజాం, ఎక్కడ పాయరావుపేట అని అంతా చర్చించుకున్నారు. రెండు నెలల క్రితం ఈ బదిలీ జరిగింది. అయినా దీని మీద వైసీపీలో రచ్చ అలాగే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వద్దు అని పాయకరావుపేట లో పెద్ద ఎత్తున వైసీపీలో పోరు సాగింది. దాంతో పాటు ఆయన గ్రాఫ్ తగ్గడంతో ఈసారి ఆయనకు చెక్ పెడతారని ఊహించారు.

అలా ఆయనకు రాజ్యసభ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చేశారు. దాంతో బాబూరావు హ్యాపీ.అయితే ఆయన కోరిక మీరకు లోకల్ గా ఉన్న వైసీపీ నేతలకు టికెట్ ఇవ్వలేదా అన్న చర్చ సాగుతోంది. బాబూరావు తన మీద యుద్ధం చేసిన వారిలో ఎవరికీ టికెట్ ఇవ్వవద్దు అని అధినాయకత్వాన్ని కోరిన మీదనే రాజం నుంచి ఈ బదిలీ జరిగింది అని అంటున్నారు.

ఇక రాజాం నుంచి వచ్చిన కంబాల జోగులుకు పాయకరావుపేటలో రాజకీయం పట్టు చిక్కడం లేదు. ఆయనకు గొల్ల బాబూరావు అండ ఉండాల్సిందే.అలా ఆయనే అన్నీ చూసుకుంటున్నారు. దాంతో బాబూరావు పట్ల అసంతృప్తిగా ఉన్న వారు మళ్లీ తమ దారి తమదే అన్నట్లుగా ఉన్నారు.

Read more!

ఇంకో వైపు చూస్తే నాన్ లోకల్ కార్డుతో టీడీపీ కూటమి జనంలోకి వెళ్తోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ఓటేస్తారా అని ప్రచారం స్టాట్ చేసేసింది. దాంతో టీడీపీ కూటమికి ఈ పరిణామాలు కలిసి వస్తున్నాయి. తెలుగు మహిళా నాయకురాలు వంగలపూడి అనిత కూడా నిజానికి నాన్ లోకల్ అనే చెప్పాలి. ఆమె విశాఖలో ఉంటూ పాయకరావు పేటకు వస్తూంటారు అని పెద్ద విమర్శ.

అయినా ఒకే జిల్లా కాబట్టి ఓకే అని ఇపుడు అనుకుంటున్నారు. దానికి కారణం రెండు జిల్లాల అవతల నుంచి కంబాల జోగులుని తెచ్చి వైసీపీ పెద్ద గీత గీయడమే అని అంటున్నారు. అనితకు ఇపుడు అంతా అనుకూలిస్తోంది అని చెబుతున్నారు. ఆమె అభ్యర్ధిత్వం వద్దు అన్న జనసేన కూడా సర్దుకుని పనిచేస్తోంది.

వైసీపీ వర్గ పోరుతో కొందరు ఆమెకే మద్దతుగా నిలుస్తున్నారు. అదే విధంగా టీడీపీలో కూడా అంతా ఐక్యంగా పనిచేస్తున్నారు. దీంతో గెలుపు నకు ఢోకా లేదు భారీ మెజారిటీతో అనిత విజయం సాధించడం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే వైసీపీ రెండు సార్లు గెలిచిన ఈ సీటుని తాము వదులుకోమని గెలుపు తమదే అని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News