వైసీపీకి ఎందుకో ఉత్తరాంధ్రా ఫెచ్ అవుతుందంట !

వైసీపీకి ఉత్తరాంధ్రాలో మళ్ళీ సానుకూలత వస్తోందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే జవాబు వస్తోంది.;

Update: 2025-06-19 02:30 GMT

వైసీపీకి ఉత్తరాంధ్రాలో మళ్ళీ సానుకూలత వస్తోందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే జవాబు వస్తోంది. వైసీపీ ఓడి గట్టిగా అయింది. ఎంతలా అంటే మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీకి 2024 ఎన్నికల్లో దక్కినవి కేవలం రెండంటే రెండు మాత్రమే. వైసీపీలో దిగ్గజ నేతలు అంతా ఓటమికి గురి అయి డీలా పడ్డారు.

ఇక చూస్తే గత ఏడాదిగా వైసీపీ కూడా రాజకీయంగా పెద్దగా యాక్టివిటీ చేయడంలేదు. ఇంచార్జిలు కూడా ఆశించినంతగా జనంలోకి వెళ్ళడం లేదు. అయితే అనూహ్యంగా వైసీపీ ఉత్తరాంధ్రాలో పుంజుకుంటోంది అని అంటున్నారు. దానికి కారణం కూటమిలో ఉన్న పార్టీల మధ్య వైష్యమ్యాలు అలాగే లోకల్ గా ఆధిపత్య పోరు, ఎమ్మెల్యేలు కొంతమంది కట్టుదాటి దూకుడు చేయడం ఇలాంటి విషయాలతో వైసీపీకి ఉత్తరాంధ్రాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

నిజానికి ఉత్తరాంధ్రా మొదటి నుంచి కంచుకోటగా ఉంది. అనేక నియోజకవర్గాలలో ఎక్కువ సార్లు గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. అలాగే జనసేన బీజేపీ జత కావడంతో 2024 ఎన్నికలు నల్లేరు మీద బండిలా సాగిపోయాయి. కానీ ఇపుడు సీన్ అలా లేదని అంటున్నారు.

విజయనగరం శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో వైసీపీకి కొంత అనుకూలత కనిపిస్తోంది. ఇక్కడంతా బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వైసీపీ వైపు మెల్లగా వారు టర్న్ అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే విశాఖ సిటీ మాత్రం టీడీపీకే ఇప్పటిదాకా మొగ్గు చూపిస్తోంది.

విశాఖ సిటీ మినీ ఇండియాగా ఉంటుంది. చదువరులు ఎక్కువ. అలాగే ఎంప్లాయీస్ ఎక్కువ. అదే విధంగా చూస్తే అన్ని వర్గాల ప్రజానీకం ఉంటారు ఉన్నత వర్గాలు ఎగువ మధ్య తరగతి వర్గాలు కూడా ఎక్కువ. దాంతో విశాఖ సిటీలో మాత్రం కూటమికి ప్లస్ గానే అంటున్నారు.

ఇటీవల వస్తున్న పలు సర్వేలలో చూస్తే కనుక ఉత్తరాంధ్రాలో మెల్లగా వైసీపీకి జగన్ కి మొగ్గు కనిపిస్తోంది అని అంటున్నారు. విశాఖ సిటీలో సైతం గాలి మార్పు కనిపిస్తోంది అని అంటున్నారు. జగన్ కి ఫేవర్ గా ఒపీనియన్ చేంజి అవుతోంది అని అంటున్నారు. దానికి కారణం టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేయడంలేదు అన్న భావన నగర వాసులలో ఉంది అని అంటున్నారు.

ఎంతసేపూ అమరావతి జపం తప్ప విశాఖ ఊసు లేకపోవడం మీద జనాలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. అమరావతిని అభివృద్ధి చేసినట్లుగా విశాఖను కూడా చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే విశాఖ రెడీ మేడ్ సిటీ అని అంటున్నారు. అంతే కాదు విసాఖలో అన్నీ ఉన్నాయని అందువల్ల ప్రభుత్వం తలచుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న భావన ఉంది.

అయితే ముంబైగా చేస్తామని మరోలా చేస్తామని నోట్లో బూరెలు వండడం తప్పించి ఆచరణలో మాత్రం విశాఖకు ఏడాదిగా చూస్తే పక్కగా చేసినది ఏదీ లేదనే అంటున్నారు ఉత్తరాంధ్రాలో సాగు తాగు నీటి సదుపాయల మీద కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకూ గోదావరి నీళ్ళు అందించే ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేదు, అలాగే వంశధార అభివృద్ధి పనులు పడకేశాయి. ఉత్తరాంధ్రాలో ఎన్నో చిన్న నదులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేస్తే సాగు తాగు నీరుకు ఏ మాత్రం కొరత ఉండదు అని అంటున్నారు.

ఆ దిశగా ఆలోచన అయితే చేయడంలేదని అంటున్నారు. అంతే కాదు ఉత్తరాంధ్రాలో పరిశ్రమల విషయంలోనూ ప్రభుత్వం శీత కన్ను వేసిందని అంటున్నారు. విశాఖను రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు. అమరావతి రాజధాని అంటూ కూటమి అటే ఫోకస్ పెడుతోంది. దాంతో ఇపుడు విశాఖ వాసులు ఎందుకో జగన్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని అంటున్నారు.

విశాఖకు ఏమి తక్కువ అయింది అని వారు అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదన్న ఆవేదన ఆగ్రహం వారిలో ఉంది. మొత్తానికి చూస్తే కనుక విశాఖలో మార్పు రావడం అంటే అది కూటమిని డేంజర్ సిగ్నలే అని అంటున్నారు. రూరల్ ఏరియాలలో ఎటూ కొంత వైసీపీకి మొగ్గు ఉంటుంది. కానీ సిటీలో మార్పు వస్తే మాత్రం కూటమికి ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి ఈ మార్పు ఏ వైపునకు దారి తీస్తుందో.

Tags:    

Similar News