బొత్స రాజ‌కీయం ప‌దును త‌గ్గుతున్న వేళ‌.. శ్రీను స్ట్రాట‌జిక్ స్టెప్‌!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లిలో వైసీపీ ప‌క్ష‌నేత‌గా చ‌లామ‌ణి అవుతున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ మేన‌ల్లుడు మ‌జ్జి శ్రీనివాస‌రావు(ఉర‌ఫ్ చిన్న శ్రీను) టీడీపీలో చేర‌డం సంచ‌న‌లంగా మారింది.

Update: 2026-09-09 00:30 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లిలో వైసీపీ ప‌క్ష‌నేత‌గా చ‌లామ‌ణి అవుతున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ మేన‌ల్లుడు మ‌జ్జి శ్రీనివాస‌రావు(ఉర‌ఫ్ చిన్న శ్రీను) టీడీపీలో చేర‌డం సంచ‌న‌లంగా మారింది. ఎవ‌రు ఏ పార్టీలో అయినా చేరే ప్ర‌జాస్వామ్యం ఉన్నా.. ఉప్పు-నిప్పుగా ఉన్న వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజకీయాల్లో ఈ ప‌రిణామం ఆశ్చ‌ర్యంగా మారింది. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. చిన్న శ్రీను.. సైకిల్ ఎక్క‌డంతో ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం బొత్స రాజ‌కీయాల వేడి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త 35 సంవ‌త్స‌రాలుగా రాజ‌కీయాల్లో ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉత్త‌రాంధ్ర‌పై ప‌ట్టు పెంచుకున్నారు. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్స‌కు తిరుగులేద‌న్న టాక్ కూడా ఉంది. అయితే.. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌నేప‌థ్యంలో బొత్స ప్ర‌భావం త‌గ్గ‌డంతోపాటు..టీడీపీ దూకుడు పెరిగి.. ఏకంగా బొత్స రాజ‌కీయాలు మ‌స‌క‌బారుతున్నాయ‌న్న వాద‌న కూడా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌న స‌తీమ‌ణితోపాటు తాను కూడా ఓడిపోయిన నేప‌థ్యంలో సొంతం చేసుకున్నారు.

ఈ ప‌రిణామాల‌తో మ‌జ్జి శ్రీను.. ముంద‌స్తు వ్యూహంతో టీడీపీ చెంత‌కు చేరిపోయార‌ని అంటున్నారు. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌న కుమార్తు స‌హ‌స్ర‌కు విజ‌య‌న‌గ‌రం మునిసిపాలిటీలో మేయ‌ర్ పీఠాన్ని ఆశిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి టీడీపీ కూడా అంగీకారం తెలిపింద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యానికి తోడు బొత్స హ‌వాను సంపూర్ణంగా త‌గ్గించ‌డం.. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి భారీ ఝ‌ల‌క్ ఇవ్వ‌డం వంటివి కూడా మ‌జ్జి శ్రీనివాస‌రావును చేర్చుకోవ‌డం వెనుక ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

వైసీపీకి దెబ్బే!

యువ నాయ‌కుడిగా ఉన్న మ‌జ్జి శ్రీను.. విజ‌య‌న‌గరం.. వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆ ప‌ద‌వితో పాటు.. భీమిలి ఇంచార్జ్ స‌హా వైసీపీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రిజైన్ చేశారు. దీంతో వైసీపీకి భారీ దెబ్బేన‌ని అంటున్నారు. ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వ‌ర్గంలో బ‌లమైన నాయ‌కుడిగా ఉండ‌డంతో స్థానిక యువ‌త‌లోనూ క్రేజ్ ఉన్న చిన్న శ్రీను పార్టీని వ‌దిలేయ‌డం వైసీపీకి మైన‌స్‌గా మార‌నుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీనిపై బొత్స స‌త్య‌నారాయ‌ణ మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News