• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భరించే శక్తి లేదు.. .ఇదే...

భరించే శక్తి లేదు.. .ఇదే నా చివరి వీడియో.. బరస్ట్ అయిన మహిళా రెజ్లర్

| తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర భావోద్వేగానికి గురైంది జాతీయ మహిళా రెజ్లర్ రౌనక్ గులియా.

By - Tupaki Desk
Update: 2023-09-01 04:47 GMT

తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర భావోద్వేగానికి గురైంది జాతీయ మహిళా రెజ్లర్ రౌనక్ గులియా. ఇటీవల ఆమె మీదా ఆమె భర్త మీదా కలిసి చీటింగ్ కేసు నమోదు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వీడియోను పోస్టు చేశారు. అందులో కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. ఇదే తన చివరి వీడియో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

జాతీయ మహిళా రెజ్లర్ రౌనక్ గులియా.. ఆమె భర్త అంకిత్ గులియాలు సుపరిచితులే. అయితే.. బాడీ బిల్డర్ పోలీస్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపక్ శర్మ ప్రస్తుతం తీహార్ జైల్ అసిస్టెంట్ సూపరిండెంట్ గా పని చేస్తున్నారు. ఒక రియాల్టీ షోలో రెజ్లర్ల జంట తనకు పరిచయమైందని చెప్పిన ఆయన.. ఆ తర్వాత తనను వారిద్దరు కలిసి వ్యాపారంలో మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఇది కాస్తా సంచలనంగా మారాయి.

మహిళా రెజ్లర్.. ఆమె భర్త కలిసి హెల్త్ ప్రొడక్ట్స్ బిజినెస్ నిర్వహిస్తున్నారని.. అందులో పెట్టుబడులు పెట్టాలని.. భారీ లాభాలు వస్తాయని ప్రామిస్ చేశారని దీపక్ చెబుతున్నారు. ఈ బిజినెస్ లో తాను రూ.50 లక్షల పెట్టుబడి పెట్టేలా చేశారని.. ఇప్పుడు మాత్రం ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోవటం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన డబ్బు తనకు తిరిగి ఇవ్వని ఉదంతంపై తాను వారిపై కేసు నమోదు చేసినట్లుగా దీపక్ పేర్కొన్నారు.

ఈ ఆరోపణలు సంచలనంగా మారిన నేపథ్యంలో రెజ్లర్ రౌనక్ గులియా రియాక్టు అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆమె కొట్టేశారు. ఒక వీడియోను షేర్ చేసిన ఆమె.. ఇదే తన చివరి వీడియో అని.. తనను క్షమించాలని కోరారు. తనపై చేసిన ఆరోపణల్ని భరించే ధైర్యం తనకు లేదని.. దేవుడు అన్నీ చూస్తాడన్న ఆమె.. ‘‘అతను చేసిన పనులకు శిక్ష అనుభవిస్తాడు’’ అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.ఈ వీడియోకు పలువురు స్పందిస్తూ.. మీరు రెజ్లర్.. మీరు పోరాడాలని.. అధైర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. రెజ్లర్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags:    
  • Raunakgulia 
  • Wrestler 
  • Haryana 
  • Instagram 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS