• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రీల్ ‘నీలాంబరి’ అప్...

రీల్ ‘నీలాంబరి’ అప్ గ్రేడ్ వెర్షన్ రియల్ లైఫ్ లోకి వస్తే

| ఈ ఉదంతం గురించి విన్నంతనే అప్పట్లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘నరసింహ’ గుర్తుకు రాక మానదు.

By - Tupaki Desk
Update: 2024-02-24 04:25 GMT

ఈ ఉదంతం గురించి విన్నంతనే అప్పట్లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘నరసింహ’ గుర్తుకు రాక మానదు. తాను కోరుకున్న హీరో కోసం నీలాంబరి క్యారెక్టర్ ఎంతలా తపించిపోవం.. తనకు దక్కక అందుకోసం ప్రతీకారం కోసం రగిలిపోయే తీరు ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. రీల్ నీలాంబరి క్యారెక్టర్ అప్ గ్రేడ్ అయి.. రియల్ లైఫ్ లోకి వస్తే ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు రూపంగా తాజా ఉదంతానని చెప్పొచ్చు. తన మనసుకు నచ్చినోడి కోసం ఒక సంపన్న యువతి తెగించిన తీరు షాకింగ్ గా మారుతుంది.

నాలుగైదు స్టార్టప్ కంపెనీలకు యజమాని అయిన ఆమె.. ఆన్ లైన్ లో తాను మనసుపడిన కుర్రాడి కోసం మరీ ఇంతలా తెగించటం ఏమిటి?అన్నది షాకింగ్ అంశంగా మారింది. తనకు నచ్చాడు కాబట్టి.. తనను పెళ్లి చేసుకోవాలని అడగటమే కాదు.. నో అన్నందుకు తన వాళ్ల చేత కిడ్నాప్ చేయించి.. కొట్టించిన ఉదంతం వింటే రీల్ నీలాంబరి చప్పున గుర్తుకు రావటం ఖాయం. హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

మాదాపూర్‌కు చెందిన 31 ఏళ్ల అమ్మాయి ఒక డిజిటల్ సంస్థను నిర్వహిస్తోంది. ఆమెకు మరో మూడు స్టార్టప్ లు ఉన్నట్లుగా చెబుతున్నారు. సంపన్న వర్గానికి చెందిన ఆమెకు గతంలో పెళ్లైంది. భర్త నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటోంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీ సైట్లలో తగిన మ్యాచ్ కోసం వెతుకుతోంది. భారత్ మ్యాట్రిమోనీ సైట్ లో ఒక ప్రొఫైల్ చూసింది. అయితే.. అదో ఫేక్ ప్రొఫైల్. అందులో పెట్టిన ఫోటోకు.. ఆ అకౌంట్ ను క్రియేట్ చేసినోడికి సంబంధం లేదు.

ఆన్ లైన్ ప్రకటనల్లో నటించే యువకుడి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. అమాయకులను వల విసరుతుండే ఒక సైబర్ నేరగాడి ప్రొఫైల్. అయితే.. ఆ ఫోటోను చూసిన ఈమె చాట్ చేయటం షురూ చేసింది. ఇంతకూ ఆ ఫోటో ఎవరిదంటే ఉప్పల్ లోని న్యూ భరత్ నగర్ కు చెందిన 27 ఏళ్ల వ్యక్తిది. అయితే.. ఫేక్ ప్రొఫైల్ అని తెలీక.. ఫోటో నచ్చి చాటింగ్ చేస్తున్న ఆమె.. అందులో భాగంగా ఎమోషనల్ గా కనెక్టు అయ్యింది. ఇదే అదనుగా సైబర్ నేరగాడు ఆమె నుంచి రూ.40 లక్షలు లాగేశాడు.

మోసపూరిత మాటలతో దఫదఫాలుగా ఆమె నుంచి డబ్బులు లాగేశాడు. మనసుకు నచ్చినోడు కాబట్టి.. డబ్బులు ఇస్తున్నా ఆమె పెద్దగా ఫీల్ కాలేదు. తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని.. భారీగా లాభాలు వస్తాయని చెప్పటంతో ఆమె నమ్మేసి ఇంత భారీగా డబ్బులు ఇచ్చేసింది. కొంతకాలానికి తన డబ్బులు ఇవ్వాలని కోరితే అవతల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో.. ఆ ఫోటో ఆధారంగా అతడెవరు? అన్నది ఆరా తీసి.. చివరకు అతడి ఫోన్ నెంబరు (సైబర్ నేరగాడిది కాదు.. ఫోటోలోని వ్యక్తిది) సంపాదించి.. అతడితో మాట్లాడింది.

ఆన్ లైన్ లో ఫోటో చూసి మనసు పడ్డానని.. అందులో భాగంగా రూ.40 లక్షలు ఇచ్చినట్లుగా చెప్పటంతో.. ఆమెకు అసలు విషయాన్ని వివరించిన ప్రణవ్.. ఆమె పెళ్లి ప్రపోజల్ ను రిజెక్టు చేశాడు. ఆమెను దూరం పెట్టాడు. దీంతో.. అతడ్ని ఎలా అయినా పెళ్లి చేసకోవాలన్న ఆమె అతడి కిడ్నాప్ కు ప్లాన్ చేసింది. అతడి కారుకు ఒక ట్రాకర్ ను అమర్చి.. అతని కదలికలపై కన్నేసింది. అతనిను కిడ్నాప్ చేసేందుకు తన సంస్థలో పని చేసే వ్యక్తిని పురామాయించింది. చివరకు ఈ నెల 11న ఇంటికి వెళుతున్న ఆ వ్యక్తి ని  కిడ్నాప్ చేసి.. అతడ్ని తన ఆఫీసుకు తీసుకొచ్చారు. పెళ్లికి నో చెప్పాడని తీవ్రంగా కొట్టారు. చివరకు దెబ్బలకు తాళలేక.. ఆమె ఫోన్ కాల్స్ కు రియాక్టు అవుతానని చెప్పటంతో అతడ్ని వదిలేశారు. దీంతో.. బయట పడిన అతను పోలీసుల్ని ఆశ్రయించి.. తనకు ఎదురైన టార్చర్ ను వివరించారు. రంగంలోకి దిగిన పోలీసులు రీల్ నీలాంబరికి మించిన రియల్ క్యారెక్టర్ ను అరెస్టు చేశారు. కిడ్నాప్ లో ఆమెకు సహకరించిన వారి కోసం వెతుకుతున్నారు. ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
  • Madhapur 
  • Fakeprofile 
  • Businesswomen 
  • Cybercrimes 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS