ఉమెన్ పాలిటిక్స్.. పైచేయి వారిదే...!
మహిళల కేంద్రంగా రాజకీయాలు పెరుగుతున్నాయి. వచ్చే 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
మహిళల కేంద్రంగా రాజకీయాలు పెరుగుతున్నాయి. వచ్చే 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది వెనుకబడినా.. పార్టీలపరంగా మహిళలకు అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ విషయానికి వస్తే. టీడీపీ , జనసేనల్లో ఉన్నంత మహిళా విభాగాలు..వైసీపీలో కనిపించడం లేదు. వీరిలోనూ టీడీపీలో ఉన్న నాయకులు.. ఇతర పార్టీల్లోనూ తక్కువేనని చెప్పాలి.
తెలుగు మహిళ విభాగం నుంచి పార్టీపరంగా ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న పార్టీ టీడీపీనే. వైసీపీలో ఒక ఎమ్మెల్యే దాసరి సుధ సహా ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్సీలున్నా.. అనుకున్న విధంగా అయితే.. పైచేయి సాధించలేకపోతున్నారు. మరోవైపు.. జనసేనలో వీరమహిళ విభాగాన్ని యాక్టివ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ విభాగం పూర్తిస్థాయిలో పుంజుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. టీడీపీలోనూ తెలుగు మహిళా విభాగాన్ని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీకి ఏకంగా మహిళ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ.. యాక్టివిటీ కనిపించడం లేదు. పార్టీ చీఫ్ షర్మిల దాదాపు మూడు మాసాలుగా ఎక్కడా కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడంతో పార్టీ పరంగా వెనుకబడ్డారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇక, బీజేపీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గతంలో ప్రస్తుత ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. తర్వాత.. ఆమెను తప్పించాక.. ఆ రేంజ్‌లో బీజేపీలో ఎవరూ ఉమెన్ పాలిటిక్స్ చేయలేక పోతున్నారు.
సో.. మొత్తంగా ఉమెన్ పాలిటిక్స్ విషయంలో టీడీపీ 1వ ప్లేస్‌లో ఉండగా.. వైసీపీ రెండో స్థానంలో ఉంది. జనసేన మూడో స్థానంలో ఉన్నా.. పెద్దగాయాక్టివిటీ లేకపోవడంతో ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టారు. మొత్తం 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. బీజేపీ, కాంగ్రెస్‌లకు మహిళా నాయకుల కొరత ఏర్పడనుండ గా.. టీడీపీలో పోటీ తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. వైసీపీలో ఒకింత ఫర్వాలేదని అనుకున్నా.. ఇంకా నాయకుల కొరత అయితే వెంటాడుతుండడం గమనార్హం. ప్రస్తుతానికి మాత్రం మహిళల విషయంలో టీడీపీదే పైచేయి కావడం గమనార్హం.