పోలీసు స్టేషన్ ముందు రాహుల్ గాంధీ మెరుపు ధర్నా.. రీజనేంటి?
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల కాలంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల కాలంలో ఉరుములు లేని పిడుగు మాదిరిగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో నీట్ ప్రశ్న పత్రం లీకేజీకి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసిన సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. విద్యార్థులపై పోలీసులు లాఠీ ప్రయోగం చేయడాన్ని నిరసించారు. ఈ సమయంలో చెప్పాపెట్టకుండానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందు సీనియర్ నేతలతో కలిసి మెరుపు ధర్నాకు దిగారు.
ఆ పరిణామం గతంలో చర్చకు దారితీసింది. ప్రధాని మోడీ సమాధానం చెప్పేవరకు నిరసన విరమించే ది లేదని భీష్మించారు. ఇప్పుడు తాజాగా.. మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి మెరుపు ధర్నాకు దిగారు. నాటి పోలీసుల ఘటనకు సంబంధించిన విషయమే ఇప్పుడు కూడా తెరమీదకు తీసుకురావడం గమనా ర్హం. అప్పట్లో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించారని రాహుల్ ఆరోపించారు. బాధిత విద్యార్థిని కూడా మీడియా ముందుకు తీసుకువచ్చారు.
అయితే.. నాటి ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కేసు పెట్టకపోవడం, బాధితుడికి సరైన వైద్యం చేయకపోవడంపై తాజాగా రాహుల్ మెరుపు ధర్నాకు దిగారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట కుర్చీలు వేసుకుని బాధితుడి కుటుంబ సభ్యులు పలువురు విద్యార్థులతో కలిసి రాహుల్ ధర్నా చేశారు. పెల్లెట్ గన్ ప్రయోగంతో తనకు గాయాలయ్యాయని సాహిల్ లోచాబ్ అనే విద్యార్థి అప్పట్లో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం కూడా స్పందించాలన్నది డిమాండ్.
పోలీసులు ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిం చారు. ఈ క్రమంలో శుక్రవారం రాహుల్ లోచాబ్‌ను వెంటబెట్టుకుని స్టేషన్‌కు వెళ్లారు. తొలుత రాహుల్ గాంధీ కాన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ పార్లమెంటు స్ట్రీట్ పీఎస్‌లో ఉన్నారని తెలియడంతో అక్కడకు వెళ్లారు. రాహుల్ రావడంతో ఊహించని పరిణామం ఎదురైనట్టుగా పోలీసులు నిర్ఘాంత పోయారు. అనంతరం.. విషయం తెలుసుకుని.. ఎఫ్ ఐఆర్ కట్టేది లేదని చెప్పారు. దీంతో ఆ వెంటనే రాహుల్ స్టేషన్ ముందు మెరుపు ధర్నాకు దిగారు.