• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇకపై నో 'లేడీస్ ...

ఇకపై నో 'లేడీస్ టైలర్స్'... కారణం ఇదే!

| అయితే... ఇకపై మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదు అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-11-08 10:30 GMT

బోటిక్స్, ఫ్యాషన్ డిజైనర్స్ కాలం రానప్పటి నుంచీ లేడీస్ టైలర్స్ అనే ప్రొఫెషన్ చాలా ఫేమస్ అని చెబుతుంటారు. ఒక ప్రాంతంలో సుమారు పది మంది దర్జీలు ఉంటే.. వారిలో ఒకరిద్దరికి మాత్రమే లేడీస్ దుస్తులు కుట్టడంలో చేయి తిరిగి ఉంటుందని చెప్పుకునేవారు. అయితే... ఇకపై మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదు అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

అవును... మహిళల దుస్తులను పురుష టైలర్లు కుట్టకూడదనే ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతోపాటు "బ్యాడ్ టచ్" నుంచి మహిళలను రక్షించేందుకే ఈ కీలక ప్రతిపాదన అని చెబుతున్నారు.

ఇదే సమయంలో... అమ్మాయిలకు హెయిర్ కట్ పనులు కూడా ఇకపై పురుషులు చేయకూడదని యూపీ స్టేట్ మహిళా కమిషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఈ విషయాలను మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ ఈ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన హిమానీ అగర్వాల్... అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలని.. సెలూన్ లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే హెయిర్ కట్ చేయాలని.. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని.. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ ప్రతిపాదనలు చేశామని తెలిపారు.

వీటిని త్వరలో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి.. ఈ నిబంధనల మేరకు చట్టం తీసుకొచ్చెలా కోరతామని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదే సమయంలో.. ఈ ప్రతిపాదనలు యూపీకే పరిమితమవుతాయా.. లేక, దేశంలోని మిగతా రాష్ట్రాలకూ వ్యాపిస్తాయా అనే చర్చా మొదలైంది!

Tags:    
  • Uttarpradesh 
  • WomensCommission 
  • Newrules 
  • Womensdresses 
  • Himaniagarwal 
  • Keycomments 
  • Mentailors 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS