• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆరేళ్లలో 7 పెళ్లిళ్లు.....

ఆరేళ్లలో 7 పెళ్లిళ్లు.. ఆమెపై కర్ణాటక హైకోర్టు సీరియస్

| ఆమెకు అక్షరాల 32 ఏళ్లు. ఆరేళ్ల వ్యవధిలో 7 పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా ఏడో పెళ్లిని సైతం పెటాకులు చేసుకునేందుకు సిద్ధమైంది

By - Tupaki Desk
Update: 2024-07-30 04:58 GMT

ఆమెకు అక్షరాల 32 ఏళ్లు. ఆరేళ్ల వ్యవధిలో 7 పెళ్లిళ్లు చేసుకుంది. తాజాగా ఏడో పెళ్లిని సైతం పెటాకులు చేసుకునేందుకు సిద్ధమైంది. విడాకులు ఇప్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకు ఆమె దెబ్బకు హడలిపోయిన మాజీ భర్తలకు భిన్నంగా ఏడో భర్త మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు. ఆమె గత చరిత్రను బయటకు తీసి.. హైకోర్టు ఎదుట పెట్టారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

కర్ణాటకకు చెందిన ఒక మహిళ శ్రీమంతుల్ని పెళ్లి చేసుకోవటం.. పెళ్లైన ఆర్నెల్లకే విడాకులు ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించటం ఒక అలవాటు. ఈ క్రమంలో సదరు భర్త నుంచి సెటిల్ మెంట్ అమౌంట్ తీసుకొని చెక్కేస్తుంటారు. ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. ఆరుగురు భర్తలకు విడాకులు ఇచ్చింది. పెళ్లైన ఆర్నెల్లకే తనను భర్త.. అత్తింటి కుటుంబం వారు వేధిస్తున్నారంటూ గ్రహహింస కేసు పెట్టేది.

ఓవైపు కేసులు.. మరోవైపు ఆమె తీరును భరించలేని భర్తలు ఆమెతో రాజీ చేసుకొని.. పెద్ద ఎత్తున సెటిల్ మెంట్ కు ఓకే చెప్పేసి విడాకులు తీసుకునే వారు. ఆ వెంటనే మరొకరిని ఆమె పెళ్లాడేది. మళ్లీ.. అక్కడా అదే కథ. ఏడో భర్త విషయంలో మాత్రం తేడాగా జరిగింది. పెళ్లైన ఆర్నెల్లకే విడాకుల కోసం అప్లై చేయగా.. గుట్టు చప్పుడు కాకుండా ఆమె గతంలో చేసుకున్న ఆరు పెళ్లిళ్లు.. విడాకుల సమాచారాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఏడో భర్త తెర మీదకు తెచ్చిన ఆమె గతాన్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.

కేవలం డబ్బు కోసమే ఇలా పెళ్లిళ్లు చేసుకోవటం.. విడాకులకు అప్లై చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మహిళల రక్ష కోసం తీసుకొచ్చిన చట్టాన్నిఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తున్న మహిళ తీరును హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పు పట్టారు. విడాకులకు అప్లై చేసుకున్న మహిళ తీరును ప్రశ్నించిన ఆయన.. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవటం ఏమిటి? అందులో మీ తప్పే కనిపిస్తోందని సీరియస్ అయ్యారు. ఈ కేసు తుది విచారణను ఆగస్టు 21కు వాయిదా వేశారు. ఈమె ఉదంతం సంచలనంగా మారింది.

Tags:    
  • Marriages 
  • Cheatinghusbands 
  • Karnatakhighcourt 
  • Settlementamount 
  • Womanmarriages 
  • Weedings 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS