• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహిళా ఎమ్మెల్యేకు, ఆమె...

మహిళా ఎమ్మెల్యేకు, ఆమె భర్తకు కాంగ్రెస్‌ సీట్లు ఇచ్చేనా?

| ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేఖా నాయక్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖానాపూర్‌ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

By - Tupaki Desk
Update: 2023-08-22 09:07 GMT

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడు స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. వీటిలో ఒక్క వేములవాడ మినహాయించి మిగిలివన్నీ ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలే కావడం గమనార్హం.

ముఖ్యంగా 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీఆర్‌ఎస్‌ తరఫున నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ లో గెలుపొందిన అజ్మీరా రేఖానాయక్‌ కు ఈసారి కేసీఆర్‌ సీటు నిరాకరించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆమెను తప్పించి భూక్యా జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌ కు కేసీఆర్‌ సీటు కేటాయించారు.

దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీట్లు రానివారిపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. వారితో మంతనాలు జరుపుతోంది. మరోవైపు సీట్లు లభించని నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ క్రమంలో తనకు సీటు దక్కకపోవడంతో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్‌ లో చేరడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆమె భర్త శ్యాం నాయక్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రేతో ఆగస్టు 22 సాయంత్రం సమావేశం కానున్నారు. ఆమె మంగళవారమే ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరతారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేఖా నాయక్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఖానాపూర్‌ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కూడా తనతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్‌ లో తన సత్తా ఏంటో చూపిస్తానని సవాల్‌ విసిరారు.

కాగా రేఖానాయక్‌ భర్త మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్‌ అసిఫాబాద్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేఖా నాయక్‌ ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్‌ సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందని అంటున్నారు.

కాగా అసిఫాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కుకు కూడా కేసీఆర్‌ సీటు నిరాకరించారు. ఆత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొంది ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఆత్రం సక్కుకు వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం కేటాయిస్తారని.. అందుకే ఆయనకు ఇప్పుడు అసెంబ్లీ టికెట్‌ కేటాయించలేదని చెబుతున్నారు. అయితే ఆయన కూడా అసెంబ్లీకే పోటీ చేయడానికి మొగ్గుచూపుతున్నారని టాక్‌ నడుస్తోంది.

Tags:    
  • Telangana 
  • Brs 
  • Kcr 
  • Candidatelist 
  • Announcement 
  • Ajmeera 
  • Rekhanayak 
  • Shyamnayak 
  • Congress 
  • Elections 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS