• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సో మెనీ డౌట్స్ : వైసీపీ...

సో మెనీ డౌట్స్ : వైసీపీ మళ్ళీ గెలవదా ?

| అయిదేళ్ల పాటు ఒక పార్టీని చూసిన జనాలు మార్పు కోరుకుంటే అపొజిషన్ బెంచ్ లోకి మారాల్సి వస్తుంది.

By - Tupaki Desk
Update: 2025-01-25 07:30 GMT

ఏ రాజకీయ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. అది రాత్రీ పగలు లాంటివి. అయిదేళ్ల పాటు ఒక పార్టీని చూసిన జనాలు మార్పు కోరుకుంటే అపొజిషన్ బెంచ్ లోకి మారాల్సి వస్తుంది. అయితే ఆ అయిదేళ్ళూ ఆ పార్టీ ప్రజల మధ్యన ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల వాణిని బలంగా వినిపించాలి.

దానికి పార్టీ మొత్తం ఒక్కటిగా పనిచేయాల్సి ఉంటుంది అధినాయకుడి నుంచి దిగువ స్థాయి కేడర్ వరకూ అందరూ సమిష్టిగా కష్టించాల్సి ఉంటుంది. ఏ ప్రాంతీయ పార్టీకైనా నాయకుడి ఇమేజ్ చాలా ముఖ్యం. అదే సమయంలో దానికి అనుకూలంగా గ్రాఫ్ ని పెంచే బాధ్యత పార్టీ క్యాడర్ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రాంతీయ పార్టీలలో అధినేత చుట్టూ రాజకీయాలు జరుగుతాయి. కానీ అధినేతతోనే అన్నీ అంటే కుదరవు. టీడీపీలో చూసుకుంటే చంద్రబాబు పార్టీకి గ్రామర్ గా ఉంటారు. పార్టీని నిరంతరం ఆయన నడిపిస్తారు. అందుకే బాబు హయాంలో ఆ పార్టీలో ఎక్కువగా బయటకు పోయిన నాయకులు లేరు.

అదే వైసీపీలో చూస్తే ఆ రకమైన పార్టీ స్ట్రక్చర్ లేదనే అంటున్నారు. ఇక జగన్ కి ఉన్న అపారమైన జనాదరణ వల్ల మళ్ళీ గెలిచి తీరుతామని నమ్ముతున్నారు. కానీ పార్టీ పట్ల జనంలో కాదు, ముందు పార్టీ జనంలో విశ్వాసం పెరగాలి అని అంటున్నారు.

వరసబెట్టి నేతలు అంతా రాజీనామాల బాట పడుతూంటే కేడర్ డీ మోరలైజ్ అవుతుందని అంటున్నారు. బిగ్ షాట్స్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న నాయకులే వీడిపోతూంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదా అన్న సందేహాలు వచ్చి తీరుతాయని అంటున్నారు.

ఏ పార్టీకైనా ముందు స్వీయ నమ్మకం చాలా ముఖ్యం. అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉండాలి. ఆ విధంగా జరగాలీ అంటే దైనందిన కార్యక్రమాలు పార్టీలో సాగుతూ ఉండాలి వైసీపీలో చూస్తే ఓటమి తరువాత ఏ మాత్రం చలనం లేకుండా పార్టీ స్తబ్దుగా ఉంది.

దానికి తోడు అన్నట్లుగా పార్టీ నుంచి కీలక నేతలు బయటకు పోతూండడం మరింతగా దెబ్బ తీస్తోంది. ఇక పార్టీలో ఉన్న వారు సైతం నైరాశ్యంలో నిండా మునుగుతున్నారు. ఇంకో వైపు చూస్తే కూటమి నేతలు పదే పదే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టంగా చెబుతున్నారు.

దానికి తగినట్లుగానే పరిణామాలు వైసీపీలో చోటు చేసుకోవడంతో ఇవి మరింతగా పెరిగిపోతున్నాయి. అధినాయకత్వం కూడా ఓటమి తరువాత జనం వైపు చూడకపోవడం ఓటమి మీద ఈ రోజుకూ నిఖార్సు అయిన సమీక్ష లేదు అన్న ప్రచారం సాగడం ఓటమికి తప్పు తమది కాదని చెబుతూండడం పార్టీ వర్కింగ్ స్టైల్ లో మార్పు రాకపోవడం ఏ కోటరీ వల్ల పార్టీకి క్యాడర్ కి గ్యాప్ ఏర్పడిందో వారే ఇపుడు కూడా కీలకంగా ఉండడం వంటివి చూసిన పార్టీ జనాలకు వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదా అన్న డౌట్లు వస్తే తప్పేంటి అన్న చర్చ సాగుతోంది. దీనిని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆ దిశగా అధినాయకత్వం ముందుకు కదలాల్సి ఉందని అంటున్నారు.

ఎవరు పోయినా ఫరవాలేదు అన్న ధోరణి మంచిది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎన్నికల్లో అంకెలు ప్రధానం ప్రతీ ఒక్కరూ కీలకం. అలాంటపుడు ఏ ఒక్క నేత బయటకు పోయినా నష్టం కచ్చితంగా ఉంటుందనే అంటున్నారు. ముందు పార్టీలో నేతలను క్యాడర్ ని దగ్గర చేసుకుని వారి విశ్వాసాన్ని పొందే దిశగా వైసీపీ ప్రయత్నం చేయాలని కూడా సూచనలు వస్తున్నాయి.

Tags:    
  • Ysrcp 
  • Ycp 
  • Leadership 
  • Defeat 
  • Partymorale 
  • Regionalparties 
  • Politicalstruggles 
  • Cadre 
  • Politicaltrust 
  • Resignation 
  • Partystructure 
  • Jagan 
  • Politicalchallenges 
  • Oppositionleaders 
  • YCPleadership 
  • Partyreorganization 
  • Politicalidentity 
  • Electionstrategy 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS