• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కంటతడి పెట్టిస్తున్న నేవీ...

కంటతడి పెట్టిస్తున్న నేవీ ఆఫీసర్ భార్య "జైహింద్" సెల్యూట్ వీడియో!

| ఈ సమయంలో ఆయన మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ కనిపించి.. అనంతరం తన భర్త శవపేటికకు సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

By - Tupaki Desk
Update: 2025-04-23 18:00 GMT

కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి కొత్త జంటల జీవితాలను కాళ్ల పారాణి ఆరకముందే చిదిమేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహ బందంలోకి అడుగుపెట్టగా.. 19న విందు నిర్వహించారు.

అనంతరం తన భార్యను తీసుకొని కశ్మీర్ కు హనీమూన్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో ఆయన మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ కనిపించి.. అనంతరం తన భర్త శవపేటికకు సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

అవును... ఇండియన్ నేవీలోని ఓ లెఫ్టినెంట్ ను వివాహం చేసుకుని.. తన హనీమూన్ కోసం కశ్మీర్ కు వెళ్లింది హిమాన్షి. ఈ క్రమంలో.. వారంలోపే తన భర్త శవపేటికను కౌగిలించుకుని, ఓదార్చలేనంతగా ఏడుస్తూ.. తనను తాను నిలబెట్టుకోవడానికి సహాయం కోరింది.. అనంతరం నిటారుగా నిల్చొని సెల్యూట్ చేసింది.

భర్త శవపేటికపై పడి రోదిస్తూ.. తనను తాను కుదుటపరుచుకున్న హిమాన్షు... అనంతరం నిటారుగా నిలబడింది. "జై హింద్" అని అరుస్తూ తన భర్తకు వీడ్కోలు వందనం చేసింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారిని.. కంటతడి పెట్టిస్తోంది. అందరితోనూ తన భర్త శవపేటికకు అప్రయత్నంగానే సెల్యూట్ చేయిస్తోంది!

కాగా... మంగళవారం పహల్గాం లోని బైసరన్ లోని మైదానంలో భార్యతో కలిసి బేల్పూరి అస్వాదిస్తున్నప్పుడు లెఫ్టినెంట్ నర్వాల్ తలపై ఓ ఉగ్రవాది తుపాకీలోని తూటా దిగిపోయింది. దీంతో.. ఆమె ముఖంపై భర్త రక్తం చిమ్మింది. ఈ క్రమంలో.. బుధవారం నర్వాల్ మృతదేహాన్ని శవపేటికలో ఢిల్లీకి తీసుకొచ్చారు.

ఈ సమయంలో తన భర్త శవపేటిక ముందు నిలబడిన హిమాన్షు.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. మేము అతన్ని అన్ని విధాలుగా గర్వపడేలా చేస్తాము.. ఈ సమయంలో ఆ శవపేటికను కౌగిలించుకొని ఏడ్చింది.. దానిపై ఉన్న అధికార టోపీ ముందు పదే పదే వంగి నమస్కారం చెప్పింది.

#WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attack

The couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ

— ANI (@ANI) April 23, 2025
Tags:    
  • PahalgamTerroristAttack 
  • KashmirTerrorAttack 
  • NavyLieutenant 
  • HeroicGoodbye 
  • SaluteToTheFallen 
  • IndianArmy 
  • WifeSalutesHusband 
  • HeartbreakingFarewell 
  • JaiHind 
  • TrueLove 
  • Patriotism 

Similar News

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS