• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీమ ఓట్లు ప‌డాలంటే... ఆ 3...

సీమ ఓట్లు ప‌డాలంటే... ఆ 3 జిల్లాలే ముఖ్యం.. !

| రాయలసీమలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగలడానికి కోస్తాంధ్రలో మారిన రాజకీయ పరిస్థితులే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూటమి బలపడటం సీమ ఓటర్లపై ప్రభావం చూపిందని అంచనా వేస్తున్నారు. వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే ఈ మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

By - Garuda Media
Update: 2026-11-11 19:30 GMT

వైసీపీ విష‌యానికి వ‌స్తే.. రాయ‌ల‌సీమ‌లో ఆ పార్టీకి బ‌ల‌మైన ఫెట్చింగ్ ఉంద‌ని అంటారు. ముఖ్యంగా నెల్లూరు నుంచి క‌ర్నూలు వ‌ర‌కు గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌లోని రెడ్డి సామాజిక వ‌ర్గం పూర్తిగా త‌మ‌కు అండగా ఉంద‌ని భావిస్తారు. కానీ.. తాజా ఎన్నిక‌ల్లో సీమ‌లోనూ పార్టీకి ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌లేదు. త‌మ‌కు ఎంతో బ‌లం ఉంద‌ని భావించిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చావు దెబ్బ‌త‌గిలింది. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది? సీమ‌లో పుంజుకుంటామ‌ని.. 2024 కంటే మెరుగైన ఫ‌లితాలు రాబ‌డ‌తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఎందుకు విఫ‌ల‌మ‌య్యారు? అనేది కీల‌కం.

అయితే.. దీనిపై విశ్లేష‌కులు చెబుతున్న మాట‌... సీమ ఓట‌రు నాడి భిన్నంగా ఉంటుంద‌ని!. ఎన్నిక‌ల‌కు ముందు న్న ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని.. ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? అనే విష‌యాల‌ను అంచ‌నా వేసుకుని సీమ రెడ్లు.. ఆయా పార్టీల‌కు జై కొడుతున్నార‌ని చెబుతున్నారు. 2014లో చంద్ర‌బాబుకు జై కొట్ట‌డం వెనుక రాష్ట్ర వ్యాప్తంగా.. ముఖ్యంగా.. మూడు జిల్లాల్లో ఉన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గం అంచ‌నా వేసుకుంద‌ని చెబుతున్నారు. అవే.. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ‌, కృష్ణా జిల్లాలుగా చెబుతున్నారు.

ఆయా జిల్లాల్లో ప్ర‌జ‌ల నాడి ఏ పార్టీ, ఏ నాయ‌కుడి వైపు ఉంటే.. సీమ మొత్తం అటువైపే నిలుస్తోంద‌ని అంటున్నా రు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి.. ఈ మూడు జిల్లాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కి అనుకూల‌త పెరిగింద‌ని.. అందుకే సీమ‌లో మూడు సీట్లు(కుప్పం, ఉర‌వ‌కొండ‌, హిందూపురం) మిన‌హా అంత‌టావైసీపీ క్లీన్ స్వీప్ చేసింద‌ని అంటున్నారు. కానీ, 2024కు వ‌చ్చే స‌రికి.. మాత్రం మూడు రాజ‌ధానులు, డాక్ట‌ర్ సుధాక‌ర్ మ‌ర‌ణం, వేధింపుల నేప‌థ్యంలోఈ మూడు జిల్లాల ఓటు బ్యాంకు మారిపోయింద‌ని అంటున్నారు.

దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సీమ ఓటరు.. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం.. కూట‌మికి జై కొట్టిన‌ట్టు చెబుతున్నా రు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింద‌ని అంటున్నారు. సో.. సీమ ఓట‌రు నాడి ఎప్పుడూ.. మూడు అభివృద్ధిలో ముందున్న జిల్లాల‌పైనే ఉంటుంద‌ని.. అక్క‌డి ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకునే సీట ఓట‌రు త‌న నిర్ణ‌యాన్ని చెబుతున్నార‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. ప్ర‌స్తుతం వైసీపీకి ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ‌, కృష్ణాజిల్లాల్లో భారీగా ఎదురు దెబ్బ త‌గిలిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. కీల‌క నాయ‌కులు పార్టీ ని వీడిపోవ‌డం.. కూట‌మి బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో ఈ ప్ర‌భావం సీమ‌పై ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి వైసీపీ ముందు ఈ మూడు ప్రాంతాల‌పైనే దృష్టి పెట్టాల‌ని సూచిస్తున్నారు.

Tags:    
  • ysrcp 
  • rayalaseema 
  • andhrapolitics 
  • ysrcpfailure 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS