గురకకు చెక్ చెప్పేందుకు నోటికి టేప్.. అస్సలొద్దు బాస్!
సోషల్ మీడియాలో చెప్పే వారి మాటల్ని నమ్మి.. అలాంటి ప్రయోగాల్ని చేస్తున్న పరిస్థితి. ఈ తీరు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.;
సోషల్ మీడియా దూకుడు పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేవారే. నిపుణుల మాటలు పక్కకు వెళ్లిపోయి.. విషయాల మీద అవగాహన అంతంత మాత్రంగా ఉండే వారు తమకు తోచినట్లుగా సలహాలు ఇవ్వటం.. వారి మాటల ప్రభావానికి లోనై పలువురు వాటిని పాటించటం ద్వారా కొత్త చిక్కుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. సరిగా నిద్ర పట్టని వారు.. గురక పెట్టే వారు.. పడుకునే వేళలో నోటికి టేప్ వేసుకుంటే.. మంచిదన్న దరిద్రపుగొట్టు సలహాలు ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో చెప్పే వారి మాటల్ని నమ్మి.. అలాంటి ప్రయోగాల్ని చేస్తున్న పరిస్థితి. ఈ తీరు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గురకకు చెక్ పెట్టేందుకు నోటికి టేప్ వేయటం ఏ మాత్రం మంచిది కాదని.. ఇదెంతో ప్రమాదకరమని పేర్కొంటున్నారు. శాస్త్రీయంగా కూడా దీనికి ఎలాంటి ఆధారం లేదంటున్నారు. ఇలాంటి ప్రచారం ఆరోగ్యానికి మరింత చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
రాత్రిళ్లు నోటికి టేప్ అంటించుకోవటం ద్వారా నిద్ర మెరుగు పడిందని చెప్పటానికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని.. ఇలాంటి వాటి కారణంగా రిస్కు ఎక్కువని చెబుతున్నారు. నిద్ర రుగ్మతలు.. స్లీప్ అప్రియా లాంటి వాటితో పాటు.. నోటికి టేప్ వేయటం ద్వారా.. ఉక్కిరిబిక్కిరి అవుతారని చెబుతున్నారు. ఇదేమాత్రం మంచిది కాదని.. ఇదెంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి.. ఫిట్ నెస్ కు సంబంధించి ఎవరేం చెప్పినా వినకుండా.. నిపుణుల సలహాలు, సూచనల్ని మాత్రమే పాటించటం మంచిదని చెబుతున్నారు.