వాట్సప్ లో ప్రకటనలు.. ఎప్పటినుంచంటే..?

అవును... ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ లో ఇకపై ప్రకటనలు దర్శనమివ్వబోతున్నాయి.;

Update: 2025-06-17 04:48 GMT
వాట్సప్ లో ప్రకటనలు.. ఎప్పటినుంచంటే..?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కూడా దర్శనమివ్వబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల యూజర్లు, సరాసరిన రోజుకు సుమారు 100 బిలియన్ల మెసేజ్ లతో ఉండే ఈ ఫేమస్ యాప్ ఇప్పటివరకూ ఎలాంటి యాడ్స్ లేకుండా ఉచితంగానే సేవలందిస్తోంది. అయితే ఇప్పుడు కొత్త ప్రకటన ఒకటి చేసింది.

అవును... ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ లో ఇకపై ప్రకటనలు దర్శనమివ్వబోతున్నాయి. ఇందులో భాగంగా... ఇకపై యాప్‌ లోని అప్‌ డేట్స్‌ ట్యాబ్‌ లో ప్రకటనలకు సంబంధించిన ఫీచర్లు తీసుకొస్తున్నట్లు వాట్సప్ తన బ్లాగ్‌ పోస్ట్‌ లో పేర్కొంది. వాట్సప్‌ లోని 'అప్‌ డేట్స్‌' ట్యాబ్‌ లో ఈ ప్రకటనలకు సంబంధించిన ఫీచర్లు కనిపించనున్నాయి.

ప్రస్తుతం ఈ 'అప్‌ డేట్స్‌' ట్యాబ్‌ లో ఛానెళ్లు, స్టేటస్ విభాగాలు ఉండగా.. అక్కడే ఇవి దర్శనం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్లకు, వ్యాపారులకు, అడ్మిన్ లకు వాట్సప్‌ ద్వారా ఎదిగే అవకాశం కల్పించేందుకు ప్రకటనలు తీసుకొస్తున్నట్లు తెలిపింది. యాప్‌ వాడేవారిలో 1.5 బిలియన్ల మంది రోజూ ఈ అప్‌ డేట్స్‌ ట్యాబ్‌ ను చూస్తుంటారని వాట్సప్‌ పేర్కొంది.

ఈ క్రమంలో... మొత్తం మూడు రకాల యాడ్‌ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు వాట్సప్ వెల్లడించింది. ఇందులో భాగంగా...

ఛానెల్ సబ్ స్క్రిప్షన్: ఇందులో భాగంగా... నెలవారీ ఫీజు చెల్లించి మీకు ఇష్టమైన ఛానెల్‌ కు సపోర్ట్‌ చేయడం!

ప్రమోటెడ్‌ ఛానెల్‌: దీని ప్రకారం.. ప్రస్తుతం ఛానెల్స్‌ ను ఎక్స్‌ ప్లోర్‌ చేస్తే ట్రెండింగ్‌ లో ఉన్న కొన్ని వాట్సప్‌ ఛానెళ్లు కనిపిస్తుంటాయి. ఇకపై అడ్మిన్లు తమ ఛానెల్‌ విజిబిలిటీనీ పెంచుకోవడానికి కొంత ఫీజును చెల్లించి ప్రమోట్‌ చేయొచ్చు.

స్టేటస్‌ లో యాడ్స్: స్టేటస్‌ లో ఇప్పటి వరకు వ్యక్తుల స్టేటస్‌ లు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే.. ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్‌ లు కనిపించనున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన వాట్సప్... ప్రకటనలు కేవలం అప్‌ డేట్స్‌ ట్యాబ్‌ లో మాత్రమే కనిపిస్తాయని.. పర్సనల్‌ చాట్స్‌ ఎప్పటిలానే యాడ్‌ ఫ్రీగా ఉంటాయని పేర్కొంది. అయితే ఈ ప్రకటనల ఆప్షన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Tags:    

Similar News