• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్సీకీ రాజీనామా?...

ఎమ్మెల్సీకీ రాజీనామా? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏం చేస్తారు..?

| కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ను తిట్టి.. పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొని.. ఆపై బీజేపీ ద్వారా బయటపడి ఆ పార్టీలో చేరిన మల్లన్న ఎంతోకాలం అక్కడ ఉండలేకపోయారు.

By - Tupaki Desk
Update: 2025-03-02 00:30 GMT

సాధారణ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి కెరీర్ లో మంచి దశకు చేరుకుని.. సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకుని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాజిక అంశాలపై నిలదీస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ప్రశ్నగా మారింది.

కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ను తిట్టి.. పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొని.. ఆపై బీజేపీ ద్వారా బయటపడి ఆ పార్టీలో చేరిన మల్లన్న ఎంతోకాలం అక్కడ ఉండలేకపోయారు. చివరకు కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీగా కూడా అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఏం చేస్తారు? అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

ఎంతో పోరాటం తర్వాత గత ఏడాది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో సొంతంగా పోటీచేసినా గెలవలేకపోయిన ఆయన ఈసారి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అండతో చట్టసభలో అడుగుపెట్టారు.

ఏ ఎమ్మెల్సీ ఎన్నికయితే మల్లన్నను చట్టసభ సభ్యుడిని చేసిందో.. అదే ఎమ్మెల్సీ ఎన్నిక ఆయన కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవడానికి పరోక్షంగా కారణమైందేమో? అనిపిస్తుంది. ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ వర్గం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ఫిబ్రవరి 12లోగా సమాధానం ఇవ్వాలని కోరగా.. మల్లన్న స్పందించలేదు. దీంతో సస్పెండ్ చేసింది.

మల్లన్న ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తారా? అంటే కాదని కూడా చెప్పలేం.. పూర్తిగా బీసీ వాదంతో ముందుకెళ్లే ఉద్దేశంలో ఉన్నందున ఎమ్మెల్సీ పదవినీ వదులకోవచ్చు. గతంలో సొంతంగా పార్టీనీ స్థాపించిన మల్లన్న ఆ తర్వాత దానిపై ముందుకెళ్లలేదు. మరిప్పుడు తన 7200 ఉద్యమాన్ని కొనసాగిస్తూ సొంత పార్టీని పునరుద్ధరిస్తారేమో చూడాలి. మల్లన్న టీడీపీలో చేరతారంటూ వార్తలు వచ్చినా అందుకు అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • TeenmaarMallanna 
  • TelanganaPolitics 
  • Congress 
  • BRS 
  • BJP 
  • MLCMallanna 
  • PoliticalFuture 
  • BreakingNews 
  • TelanganaUpdates 
  • 7200Movement 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS