2026..ఆర్థికంగా అంత బాగోదట.. ఎవరుచెప్పారంటే?
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు దక్షిణాసియా మొత్తం మీదా ప్రభావితం చూపుతాయని చెబుతన్నారు.;
అంతర్జాతీయ కారణాలు 2025లో ఆర్థిక అంశాలు బలహీనంగా ఉండే పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఒక దాని తర్వాత మరొకటన్నట్లుగా ఆర్థికంగా బలహీనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇదే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. దీంతో.. బలహీన ఆర్థిక వ్రద్ధి రేటు నమోదవుతోంది. తాజాగా డబ్ల్యూ ఈఎఫ్ (ప్రపంచ ఆర్థిక వేదిక) 2025కు కొనసాగింపు అన్నట్లుగా 2026 కూడా ఉంటుందని పేర్కొంది. 2025లో భారత్ 6.5 శాతం వ్రద్దిని సాధిస్తుందని అంచనా వేయగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు.. సుంకాలు అందుకు అడ్డంకిగా మారాయి.
ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు దక్షిణాసియా మొత్తం మీదా ప్రభావితం చూపుతాయని చెబుతన్నారు. 2026లో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని 72 శాతం మంది కీలక ఆర్థిక వేత్తలు అభిప్రాయపడటమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. వర్ధమాన దేశాల్లో మధ్యప్రాచ్యం.. ఉత్తర ఆఫ్రికా.. దక్షిణాసియా.. తూర్పు ఆసియా.. పసిఫిక్ ప్రాంతాలు వ్రద్ధికి ప్రధానంగా మారతాయని అంచనా వేస్తున్నారు. చైనా భవిష్యత్తు అంచనాలపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మొత్తంగా చూస్తే.. చైనా ఆర్థిక వ్రద్ధి ఒక మోస్తరుగా మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
ఐరోపాలో బలహీనమైన వ్రద్ధి ఉంటుందని 40 శాతం మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతుంటే.. అగ్రరాజ్యం అమెరికాలో అయితే బలహీన.. తీవ్ర బలహీన వ్రద్దికి అస్కారం ఉంటుందని 52 శాతం మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడటం గమనార్హం. ఆర్థికంగా అమెరికా బలహీన.. తీవ్ర బలహీనంగా ఉంటే.. దాని ప్రభావం ప్రపంచ దేశాల గమనం మీద కూడా ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇదిలా ఉంటే.. మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావటం.. మరింత స్థిరమైన విధానాలకు అవకాశం దక్కనుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వడ్డీ రేటు కోత కూడా జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ ఏడాదికి కొనసాగింపుగా వచ్చే ఏడాదిలోనూ ఆర్థిక వ్రద్ది అంత గొప్పగా ఉండదని చెప్పాలి.