విశాఖ తీరంలో డబుల్ డెక్కర్ బస్సులు

విశాఖ అంటేనే ప్రకృతి ప్రేమికులకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. విశాఖను అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు.;

Update: 2025-06-03 01:30 GMT

విశాఖ అంటేనే ప్రకృతి ప్రేమికులకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. విశాఖను అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు. విశాఖలో అంతకంతకు టూరిజాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. విశాఖలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే వీటిని సందర్శించడానికి పర్యాటకులకు తగిన రవాణా సదుపాయాలు లేవు అని అంటున్నారు.

విశాఖ నుంచి మొదలుపెడితే ఇరవై ఆరు కిలోమీటర్లు ఉన్న భీమిలీ బీచ్ రోడ్డు దాకా చూడ చక్కని ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏపీలో టూరిజం స్పాట్ లను అభివృద్ధి చేస్తోంది. దాంతో విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ పెరిగింది.

ఈ నేపధ్యంలో విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు కను విందు చేయనున్నారు. అంత ఎత్తున బస్సులో కూర్చుని బీచ్ అందాలను ఎంచక్కా ఆస్వాదించే వీలు పర్యాటకులకు కలుగుతోంది.

ఇక డబుల్ డెక్కర్ బస్సులు విశాఖకు వచ్చేశాయి. బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రత్యేకించి ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడుపుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి రెండు డబుల్ డెక్కర్ బస్సులు విశాఖకు వచ్చాయి.

ఈ రెండు బస్సులను భీమిలీ బీచ్ రోడ్ దాకా అలాగే మరో ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కైలాసగిరి దాకా నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి ఏసీ తో పనిచేసే ఈ డబుల్ డెక్కర్ల్ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖలో ఇక మీదట సందడి చేయనున్నాయన్న మాట.

అదే విధంగా సింహాచలం ప్రఖ్యాత పుణ్య క్షేత్రాన్ని సందర్శించే భక్తుల కోసం టెంపుల్ టూరిజంలో భాగంగా అక్కడ కూడా మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. అదే విధంగా డిమాండ్ ని బట్టి విశాఖ భీమిలీ సాగర తీరం వెంబడి డబుల్ డెక్కర్ బస్సులు మరిన్ని నడిపే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఇక విజయవాడలోని బస్ బిల్డింగ్ ప్లాంట్ ని ప్రారంభించిన అశోక్ లేలాండ్ కంపెనీ ఈ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేసింది.

ఇక రెండు డబుల్ డెక్కర్ బస్సులను ఇటీవలనే ప్రభుత్వానికి అశోక్ లేలాండ్ కంపెనీ అందచేసింది. వాటిని విశాఖకు కేటాయించారు. ఒక సారి చార్జి చేస్తే కనుక ఈ డబుల్ డెక్కర్ బస్సు ఏకంగా 150 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తాయని అంటున్నారు.

ఇక డబుల్ డెక్కర్ బస్సులు అంటే అంతా హైదరాబాద్ వైపే చూసే వారు. అక్కడే ఆ ఆనందం అనుభూతిని పొందేవారు. ఇపుడు విశాఖలోనే వాటిని హాయిగా ఆస్వాదించవచ్చు అని అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖలో నడయాడుతూ పర్యాటకుల కలలను నెరవేర్చనున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల రాకతో విశాఖ టూరిజం ఖ్యాతి డబుల్ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News