ఢిల్లీతో కలిసి బెస్ట్ ర్యాంక్ కొట్టిన విశాఖ !

దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడడమే కాదు బెస్ట్ ర్యాంక్ ని విశాఖపట్నం అందుకుంది. దేశ రాజధానితో సమానంగా విశాఖ పెర్ఫార్మెన్స్ చేయడం ఇక్కడ విశేషం.

Update: 2026-09-09 03:47 GMT

దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడడమే కాదు బెస్ట్ ర్యాంక్ ని విశాఖపట్నం అందుకుంది. దేశ రాజధానితో సమానంగా విశాఖ పెర్ఫార్మెన్స్ చేయడం ఇక్కడ విశేషం. ఏ విషయంలో అంటే కాలుష్య నియంత్రణలో. పకడ్బందీగా చర్యలు తీసుకుని విశాఖ దేశంలోనే మంచి ర్యాంక్ ని అందుకుంది. అలాగే ఢిల్లీ తో కలసి 21వ ర్యాంక్ ని సాధించింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026 ర్యాంకుల్లో ఢిల్లీ విశాఖ 21వ ర్యాంక్ ని కలిసి పంచుకున్నాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026' ర్యాంకులలో విశాఖ ఈ విధంగా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ని సాధించింది.

తొలి ర్యాంక్ ఆ సిటీది :

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026 ర్యాంకులలో లక్నోకు అగ్ర స్థానం దక్కింది. ఈ కేటగిరీలో 198 పాయింట్లతో లక్నో నంబర్ వన్ గా నిలిచింది. అలాగే ఇండోర్ రెండో స్థానంలో ఉంటే 195 పాయింట్లతో జబల్‌పూర్ మూడో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ 172 పాయింట్లతో విశాఖపట్నంతో కలిసి 21వ స్థానాన్ని పంచుకుంది. గత ఏడాది ఢిల్లీ 32వ స్థానంలో ఉంది. అయితే ఈసారి ఢిల్లీ తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకోవడం విశేషంగా పేర్కొంటున్నారు. దేశంలో చూస్తే ఇతర ప్రధాన నగరాలైన హైదరాబాద్ 19వ స్థానంలో ఉంటే పాట్నా 16, ముంబై 28, చెన్నై 35, కోల్‌కతా 38వ స్థానాల్లో నిలిచాయి.

ఈ ర్యాంకుల కధ ఏంటి :

ఏమిటీ ర్యాంకులు వీటి వెనక కధ ఏంటి అంటే ఈ ర్యాంకులు అందుకున్న నగరాల్లో కాలుష్యం పూర్తిగా తొలగిపోయింది అని కాదు, అయితే కాలుష్యం విషయంలో ఈ నగరాలు తీసుకుంటున్న కీలక చర్యలు, రోడ్లపై దుమ్ము ధూళీ లేకుండా సక్రమంగా ఉంచడం, పేరుకుపోకుండా ఘన వ్యర్థాల తొలగింపు, వాహనాల ద్వారా పరిశ్రమల ద్వారా వెదజల్లే ఉద్గారాలను వీలైనంత మేరకు తగ్గింపు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, కాలుష్యం మీద ప్రజలలో అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను జాతీయ స్థాయిలో ప్రకటిస్తారు. ఈ నగరాలలో గాలి నాణ్యత తక్కువగా ఉండొచ్చు అయితే కాలుష్య నియంత్రణ చర్యలు బలంగా అమలు అవుతున్నందువల్ల ఏదో నాటికి నాణ్యమైన గాలి ఆ నగరాలకు దక్కుతుందని అంటున్నారు. జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహిస్తోంది.

ఢిల్లీని స్పూర్తిగా :

నిజానికి ఢిల్లీ అంటేనే కాలుష్యం అని చెబుతారు. శీతాకాలంలో అయితే ఢిల్లీలో ఎవరూ ఉండలేని పరిస్థితి తలెత్తుతుంది. విపరీతంగా వచ్చే పొగమంచు అలాగే విషపూరితమైన గాలి ఉన్నప్పటికీ ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు గొప్పగా ఉన్నాయని అంటున్నారు. దీని వల్ల ఢిల్లీ ఏదో నాటికి కాలుష్యం కోరల నుంచి బయట పడుతుంది అని అంటున్నారు. అలా పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఢిల్లీ 21వ స్థానంలో నిలిచింది. ఇక విశాఖ విషయం తీసుకుంటే అంతకంతకు ఈ నగరంలోనూ కాలుష్యం పెరిగిపోతోంది. అయితే దానిని నిరోధించేందుకు సరైన సమగ్రమైన చర్యలు చేపడుతూ విశాఖ కూడా దీ బెస్ట్ అనిపించుకుంటోంది. అందుకే మంచి ర్యాంక్ ని పొందింది అని అంటున్నారు.

Tags:    

Similar News