• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ కి యూత్ షేప్......

కాంగ్రెస్ కి యూత్ షేప్... ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ !

| దేశంలోనే అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ అన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వయసు ఈ రోజుకు 141 ఏళ్ళు. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ వేరేది దేశంలో లేదు.

By - Satya P
Update: 2026-09-09 03:49 GMT

దేశంలోనే అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ అన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వయసు ఈ రోజుకు 141 ఏళ్ళు. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ వేరేది దేశంలో లేదు. అయితే కాంగ్రెస్ కాలానుగుణంగా మారుతున్నా ఇంకా అనేకమైన మార్పులు అవసరం అని అంటున్నారు. ఈ రోజుకీ కాంగ్రెస్ లో వృద్ధులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. కీలక స్థానాలలో వారే ఉన్నారు. రాజీవ్ గాంధీ సమయంలో ఒకసారి కాంగ్రెస్ కి యువ నాయకత్వం దక్కింది. రాజీవ్ పట్టుదలగా ముఖ్య కేంద్రాలలో యువతను నియమించి భారీ మార్పులను తెచ్చారు.

పెద్ద ఎత్తున మార్పు :

ఆయన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో అగ్ర నేతగా ఎదిగాక ఆయన కూడా యువతకు పెద్ద పీట వేస్తున్నా ఇంకా కాంగ్రెస్ రక్తంలో పాత తరం వాసనలే కనిపిస్తున్నాయి. ఇక లాభం లేదని స్వయంగా రాహుల్ గాంధీయే రంగంలోకి దిగారు, సంస్థాగతంగా చేసే మార్పులలో భాగంగా ఒకేసారి వందకు పైగా పార్టీ పదవులను యువ నేతలకు ఇచ్చేందుకు ఆయన సిద్ధం అయిపోయారు. వరసబెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ రాహుల్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దేశంలో ఏకంగా 120 జాతీయ ప్రధాన కార్యదర్శుల పదవులను యువ నేతలకు ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ పట్టుదలగా కనిపిస్తోంది.

సీనియారిటీ కాదంటూ :

యువ నేతల ఎంపిక విషయంలో సీనియారిటీ అర్హత కాదని కాంగ్రెస్ తేల్చేసింది. పని తీరు ఎలా ఉంది నాయకులలో చురుకుదనం ఏ విధంగా ఉంది అన్నదే రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ ఫిలాసఫీని జనంలోకి బలంగా నిబద్ధతతో తీసుకుని పోయే వారే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం ముందు వివిధ రాష్ట్రాలలో ప్రాధమికంగా ఎంపిక జరిగింది. అక్కడ నెగ్గి వచ్చిన వారికి చివరి దశలో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటుగా ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఇంటర్వ్యూల ప్రక్రియలో పాల్గొంటున్నారు.

అరవై శాతం యూత్ గా :

ఇక కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఏకంగా అరవై శాతం పదవులు యువతకు కేటాయించాలని రాహుల్ గాంధీ బలమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్త ముఖాలను యువతను ముందు పెడితే కాంగ్రెస్ కి కూడా ఫ్రెష్ లుక్ వస్తుందని జనంలోకి ఈజీగా పార్టీ వెళ్తుందని ఆలోచిస్తున్నారు. ఇక ఎటువంటి సిఫార్సులు ఈ పదవుల కోసం పనిచేయవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వారి పని తీరే పదవులు తెచ్చిపెడుతుందని అంటున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి కష్టపడి పనిచేయగలమని భావించే యువ నేతలకు ఇది మంచి అవకాశంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

జిల్లా స్థాయి నుంచే :

కాంగ్రెస్ లో ఇపుడు కొత్త మార్పు కనిపిస్తోంది. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వీలైనంత వరకూ యువతకే పెద్ద పీట వేస్తున్నారు. ఇపుడు దానిని జాతీయ స్థాయికి విస్తరించారు. అయితే పార్టీ పదవుల నియామకాల కోసం ఇంటర్వ్యూలు చేపట్టడం అన్నది రాహుల్ గాంధీయే మొదలెట్టారు. ఆయన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యూఐలలో ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారానే పదవులు భర్తీ చేసి మంచి ఫలితాలు సాధించారు. ఇపుడు అదే ప్రక్రియను జాతీయ కాంగ్రెస్ లో పదవులకు కూడా అనుసరిస్తున్నారు అని అంటున్నారు. ఈ రోజున దేశమంతా జెన్ జీ జపం చేస్తోంది. రాహుల్ గాంధీ కూడా యూత్ తో కలిసిపోతున్నారు. వారికి మద్దతుగా పోరాటాలలో పాల్గొంటున్నారు. ఇపుడు పార్టీలో కూడా యూత్ కి పెద్ద పీట వేయడం ద్వారా గ్రాండ్ ఒలడ్ పార్టీ కాదు యూత్ పార్టీ అని కొత్త రూపు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నారు. మరి రాహుల్ అనుసరిస్తున్న ఈ విధానం బాగుంటే మిగిలిన పార్టీలు అనుసరిస్తాయేమో చూడాల్సి ఉంది.

Tags:    
  • rahulgandhi 
  • congressparty 
  • congress 
  • youthleadership 
  • indianpolitics 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS