• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పహల్గాం ఉగ్రదాడి.. వైరల్...

పహల్గాం ఉగ్రదాడి.. వైరల్ వీడియో ఆ జంటది కాదు!

| తాజాగా.. పహల్గామ్‌లో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది.

By - Tupaki Desk
Update: 2025-04-25 06:31 GMT

పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన అనేక వార్తలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి విషాదకర సమయంలో కూడా కొందరు బాధ్యతారాహిత్యంగా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. తాజాగా.. పహల్గామ్‌లో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. కానీ, ఆ వీడియోలో ఉన్నది వేరే జంట అని తేలింది.

పహల్గామ్‌లో ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, ఆయన భార్య కాశ్మీర్ ప్రకృతి అందాల మధ్యలో ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లయిన ఆరు రోజులకే వినయ్ ప్రాణాలు కోల్పోవడంతో ఇది వారు మరణించడానికి ముందు చివరిగా చేసిన వీడియో అంటూ చాలా మంది షేర్ చేశారు. భర్త మృతదేహం వద్ద భార్య రోదిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ కావడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది.

అయితే ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదని తేలింది. ఆ వీడియోలో ఉన్నజంట తమకు జరిగిన ఈ ప్రచారంపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాము క్షేమంగా ఉన్నామని.. తమ పై ఉగ్రదాడి జరిగిందని తన భర్త చనిపోయాడని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు. తన భర్త నేవీ అధికారి కాదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తమ పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మీడియా సంస్థలు ఇకనైనా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు.

Tags:    
  • PahalgamTerroristAttack 
  • PahalgamAttack 
  • VinayNawal 
  • MisleadingVideos 
  • TerrorAttack 
  • FakeNews 
  • SocialMediaResponsibility 
  • ViralFalseInformation 
  • MediaEthics 
  • PahalgamTragedy 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS