ఐపీఎల్ లో ఎవరీ కుర్రది? రాత్రికిరాత్రే లక్షమంది ఫాలోయింగ్
ఓ యువతి చెన్నైసూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చేసిన యాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.;
ఇప్పుడంతా డిజిటల్ యుగం.. సోషల్ మీడియా కాలం.. మొబైల్ ఫోన్ రాజ్యం.. క్షణం తీరికలేకుండా సెల్ ఫోన్ లో మొహం పెట్టి చూసేవారు కోకోల్లలు. ఇక సెల్ ఫోన్ ద్వారానే సోషల్ మీడియాలో పాపులర్ అయి లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకున్న వారూ.. రూ.లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు.
అయితే, ఫాలోవర్లను సంపాదించుకోవడం అంటే అంత తేలిక కాదు.. వేలు, లక్షల మందిని మన కంటెంట్ తో ఆకట్టుకోవడం ఇంకా కష్టం. అయితే, ఓ కుర్రది మాత్రం తన ఒక్క హావభావంతో రాత్రికిరాత్రే సోషల్ మీడియాను దున్నేసింది.
ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా శక్తి ఏమిటో చాటుతూ.. వైరల్ కంటెంట్ ఎక్కుడున్నా ఆగదు అని చూపుతూ.. ఓ యువతి చెన్నైసూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చేసిన యాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇంతకూ ఏం జరిగిందంటే?
చెన్నై-రాజస్థాన్ మ్యాచ్ లో చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగ్ఆన్ లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో స్టేడియంలోని
చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని అయిన యువతి ... ‘అరె ఏంట్రా ఇది’ తరహాలో పోజిచ్చింది.. ‘‘అబ్బా.. చేతి దగ్గర ఉంటేనా? ఆ ఫీల్డర్ ను కొట్టేస్తా’’ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంతకీ ఎవరా అమ్మాయి..
చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని అయిన యువతి వీడియోను చాలామంది సోషల్ మీడియాలో పెట్టారు. కొందరు వాట్సాప్ స్టేటస్ గా ఉంచారు. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరంటే ఆర్యప్రియ భుయాన్. చెన్నైతో మ్యాచ్ తర్వాత ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ బేస్ పెరిగిపోయింది. అంతకుముందు 16 వేల మంది ఫాలోవర్లు ఉండగా.. రాత్రికి రాత్రే వారి సంఖ్య లక్షకు చేరుకుంది. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది.
కొంతమంది సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటారు. యాదృచ్ఛికంగానే హీరోలు అవుతుంటారు. ఈ అమ్మాయి కూడా ఇలానే స్టార్ అయిపోయింది.