విజయసాయిరెడ్డి భయపెడుతున్నారా ?

ఒకనాటి ట్రబుల్ షూటర్ ఈనాడు వైసీపీకి ట్రబుల్ క్రియేటర్ గా మారారా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.;

Update: 2025-04-22 09:28 GMT
Vijay Sai reddy Tensions On YCP Leaders

ఆయన ఆ పార్టీని కొద్ది నెలల క్రితం కొండంత అండ. ఒక విధంగా చెప్పాలీ అంటే ట్రబుల్ షూటర్. ఆయన ఉంటే చాలు అంతా చక్కబడుతుందని భావించే వారు. ఆయన అన్నీ సర్దుబాటు చేస్తారని కూడా భావించేవారు. అయితే ఇపుడు అదంతా గతం అయింది.

విజయసాయిరెడ్డి వైసీపీ గేట్లు తెరచుకుని బయటకు వచ్చేశారు. ఆయన అన్నీ తెలిసిన వారు. అధినాయకత్వం గురించి పూర్తి అవగాహన ఉన్నవారు. మరి ఆయన ఎదురుగా నిలిచి సవాల్ చేస్తే అది వైసీపీ కోటకే బీటలు వేసే పరిస్థితి కల్పిస్తుందని అంటున్నారు. అంతే కాదు వైసీపీని అతలాకుతలం చేసే స్థితి కూడా ఉంటుందని అంటున్నారు.

ఒకనాటి ట్రబుల్ షూటర్ ఈనాడు వైసీపీకి ట్రబుల్ క్రియేటర్ గా మారారా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వారిని పార్టీ తన వెంటే ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ అధినాయకత్వంతో ఆయనకు ఎక్కడ బెడిసిందో ఏమో లేక హైకమాండ్ ఎందుకు ఆయనను వద్దు అనుకుందో తెలియదు కానీ విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ లో భారీ మూల్యం మాత్రం వైసీపీయే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు.

విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఒక ట్వీట్ వైసీపీని భయపెట్టేది గానే ఉంది అని అంటున్నారు. విప్పింది సగం బట్టలే అని అంటూ ఆయన చేసిన లేటెస్ట్ ట్వీట్ వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. పైగా తాను లిక్కర్ స్కాం లో విజిల్ బ్లోయర్ పాత్రధారిని అని ఆయన చెప్పుకున్నారు

ఇప్పటిదాకా దొరికిన దొంగల దొంగలు దొరకని దొంగలు తన పేరుని ఈ స్కాం లో లాగుతున్నారని ఆయన చెప్పడమూ ఇల రాజకీయ కలకలమే. తానూ ఏ ఒక్క రూపాయీ ముట్టలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అంతే కాదు లిక్కర్ దొంగల బట్టలు సగం మాత్రమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని ఆయన చేసిన ఈ ట్వీటూ రాజకీయంగా సెగలూ పొగలూ రేపుతోంది.

ఇక విజయసాయిరెడ్డి ఓపెన్ అయిపోయారా అన్న చర్చ కూడా సాగుతోంది. నేను సహకరిస్తాను అని ఆయన చెప్పడం ద్వారా ఎవరిని గురి పెట్టారు అన్నది కూడా చర్చిస్తున్నారు. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి ప్రతి కదలిక అడుగు అన్నీ కూడా వైసీపీని ఇరకాటంలో నెట్టేలాగానే ఉన్నాయి. ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో నిజాలు ఏమిటో విప్పేందుకు అన్నీ చెప్పేందుకు సిద్ధం అని ఒకనాటి వైసీపీ పునాది వంటి నేత చెబుతున్నారు అంటే ఎవరిని ఇది టార్గెట్ చేస్తుందో ఎవరి కొంప మునుగుతుందో అన్న చర్చ అయితే సర్వత్రా ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి మాత్రం ఒకనాటి తన పార్టీని భయపెట్టేస్తున్నారు అనే అంతా అంటున్నారు.

Tags:    

Similar News