విజయసాయిరెడ్డి కుమార్తెని వెంటాడుతున్న కేసు!

ఇక 1986 పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారిద్దరి పైనా ఈ నెల 10న భీమిలీ కోర్టులో అధార్టీ కేసు దాఖలు చేసిందని చెబుతున్నారు.;

Update: 2025-07-22 17:18 GMT

మాజీ రాజకీయ నాయకుడిగా విజయసాయిరెడ్డిని చెప్పు కోవాలి. అంతే కాదు మాజీ ఎంపీగానూ చెప్పుకోవాలి. దానికి కారణం ఆయన ఇపుడు ఏ రాజకీయ పార్టీలో లేరు. అయితే ఆయనకు గతంలో వైసీపీ కీలక నేతగా ఉన్నప్పుడు రాజకీయ కారణాలు పరిణామాలు దాని పర్యవసానంగా కేసులు ఇపుడు ఇబ్బంది పెడుతున్నాయి.

ఒకసారి రాజకీయ అవతారం ఎత్తాక దాని నుంచి విరమణ ఉండదు, విరమించినా గత పరిణామాలు అలా అనుసంధానిస్తూనే ఉంటాయనడానికి ఆయన కుమార్తె నేహా రెడ్డి విషయంలో ఒక కేసు వెంటాడడమే . భీమిలీ బీచ్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అప్పట్లో ఫిర్యాదులు చాలా మంది చేశారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అధారిటీకి ఈ ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో నేహా రెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి పైన కేసు నమోదు చేయబడింది.

ఇక 1986 పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారిద్దరి పైనా ఈ నెల 10న భీమిలీ కోర్టులో అధార్టీ కేసు దాఖలు చేసిందని చెబుతున్నారు. ఇక తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనల ప్రకారం ఎవరూ అక్కడ శాశ్వత కట్టడాలు నిర్మించరాదు. కానీ దానిని ఉల్లఘించి నిర్మాణాలు చేపట్టారు అన్న దాని మీద ఈ కేసు దాఖలు అయింది. ఇక ఈ కేసు విషయంలో జనసేన కార్పోరేటర్ గా ఉన్న పీతల మూర్తీ యాదవ్ గతంలో నేహా రెడ్డి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పిల్ ఒకటి కోర్టులో దాఖలు చేశారు.

దీంతో తొందరలోనే కేంద్ర పర్యావరణ కమిటీ కూదా ఈ విషయాన్ని పరిశీలించి తనదైన చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక విశాఖ భీమిలి తీర ప్రాంతంలో నేహా రెడ్డి ఒక స్టార్ హోటల్ కోసం నిర్మించిన గోడను హై కోర్టు నుంచి వచ్చిన డైరెక్షన్ల మేరకు కూల్చివేశారు. ఇక ఇపుడు ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ కూడా సీరియస్ గానే ఉండబోతోంది అని తాజా చర్యలు సూచిస్తున్నాయి.

మొత్తం మీద చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి రాజకీయాలు త్యజించారు. తాను ఏ పార్టీలో చేరేది ఇక లేదని కూడా స్పష్టం చేశారు. ఆయన ఇపుడు తనతో పాటు తన వాళ్ళు అనుకున్న వారి మీద కేసులు ఉండటంతో వాటి నుంచి రిలీఫ్ ఎలా అన్నది ఆలోచిస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. కానీ అవి అలా ముందుకు తోసుకుని వస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది. మరి రానున్న రోజులలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News