• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాకిస్తాన్ తో యుద్ధం :...

పాకిస్తాన్ తో యుద్ధం : ‘ఇందిరమ్మ’ ఐడియానే బెటర్ అట?

| వైసీపీ ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-04-26 12:12 GMT

వైసీపీ ఎంపీ పదవికీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సంచలన విషయాలు బయటపెట్టిన సాయిరెడ్డి.. తాజాగా కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ వార్తల్లోకెక్కారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక సలహా ఇచ్చారు. పాకిస్తాన్ పీచమణచాలంటే ఏం చేయాలో తేల్చి చెప్పారు.

భారత్ లో సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. "ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? దావూద్ ఇబ్రహీం ఎక్కడ నివసిస్తున్నాడు? మసూద్ అజార్ ఎక్కడ దాక్కున్నాడు?" అని ప్రశ్నిస్తూ, దీనికంతటికీ ఒకే సమాధానం - పాకిస్తాన్ అని సాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ఎగుమతిదారు పాకిస్తాన్ అని ఆయన ఆరోపించారు.

-1971 రిపీట్ చేయండి: సాయిరెడ్డి సలహా

పాకిస్తాన్ ఉగ్రవాదానికి విరుగుడుగా భారత్ ఏం చేయాలో విజయసాయిరెడ్డి తన సలహా రూపంలో సూచించారు. భారతదేశం పష్తున్ , బలోచ్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అలాగే పాకిస్తాన్ నుండి పుట్టిన కొత్త దేశాలతో 1971 నాటి చారిత్రక సంఘటనను పునరావృతం చేయాలంటూ కేంద్రాన్ని సూచించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై 1971 తరహాలోనే మరోసారి యుద్దం చేయాలంటూ దేశంలో డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా దాన్నే సమర్ధించారు.

1971లో పాకిస్తాన్ పై జరిగిన యుద్దంలో భారత సేనలు వీరోచితంగా పోరాడి, ఆ దేశంలోని తూర్పు భాగాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశాయి. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధం భారత్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని కొత్త మిత్రులైన పష్తూన్ (పాక్-ఆప్ఘన్ సరిహద్దుల్లో నివసించే గిరిజనులు), బలోచ్ (పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతాల్లో నివసించేవారు)తో కలిసి రిపీట్ చేయాలని విజయసాయిరెడ్డి తన సలహా ద్వారా కోరుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ కీలక డిమాండ్/సలహాపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Where was Osama bin Laden found? Where does Dawood Ibrahim live? Where is Masood Azhar hiding? One answer: Pakistan — the world’s biggest exporter of terror. India must back Pashtun and Baloch movements and replay 1971 with new nations born from Pakistan. #PahalgamTerroristAttack

— Vijayasai Reddy V (@VSReddy_MP) April 26, 2025
Tags:    
  • VijayasaiReddy 
  • Modi 
  • PakistanTerrorism 
  • Balochistan 
  • PashtunRights 
  • 1971War 
  • IndiaPakistan 
  • NationalSecurity 
  • BalochMovement 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS