లాకప్ డెత్ పై రంగంలోకి విజయ్... స్టాలిన్ సర్కార్ పై ఫైర్!
అవును... తమిళనాడులో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ లాకప్ డెత్ ఇష్యూ తీవ్ర సంచలనంగా మారిన వేళ.. తాజాగా దీనిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.;
తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ ఇష్యూ తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం స్టాలిన్ సర్కార్ కి పెను సమస్యగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించగా... దానిలో విజయ్ నల్ల చొక్కా ధరించి ఎంట్రీ ఇచ్చారు. సర్కార్ పై విరుచుకుపడ్డారు.
అవును... తమిళనాడులో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ లాకప్ డెత్ ఇష్యూ తీవ్ర సంచలనంగా మారిన వేళ.. తాజాగా దీనిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 'తమిళగ వెట్రి కళగం' పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... 'రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదు, న్యాయం' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నల్ల చొక్కా ధరించి పాల్గొన్న విజయ్.. 'సారీ కాదు, మాకు న్యాయం కావాలి' అని రాసున్న ప్లకార్డును ప్రదర్శించారు. ప్రభుత్వం నుంచి ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోందని.. అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు.. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని ప్రశ్నించారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన పలు దారుణాలపై కోర్టులే జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పిన విజయ్... 'అలాంటప్పుడు మీ పాలనతో మాకేం అవసరం?.. ముఖ్యమంత్రితో ఏం అవసరం? అంటూ ఫైర్ అయ్యారు. సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ పేద కుటుంబం నుంచి వచ్చిన యువకుడని టీవీకే విజయ్ తెలిపారు.
ఈ సందర్భంగా... ఈ ఘటన అనంతరం సీఎం సారీ చెప్పారని.. ఈ ప్రభుత్వ హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారని.. వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని.. అజిత్ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా స్టాలిన్ ప్రభుత్వాన్ని విజయ్ డిమాండ్ చేశారు.
కాగా... భద్రకాళియమ్మన్ ఆలయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు మహిళా భక్తుల నగలు అపహరణకు గురవ్వగా.. ఈ కేసులో ఆ ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్ కుమార్ తో సహా పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అజిత్ ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు!
ఈ క్రమంలో... అజిత్ కుమార్ ఒంటిపై 44 గాయాలున్నట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందులో భాగంగా... గుండె, కాలేయం వంటి అంతర్గత భాగాల్లో తీవ్ర రక్తస్రాం అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.