• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇష్యూని వేణు స్వామి...

ఇష్యూని వేణు స్వామి డైవర్ట్ చేస్తున్నారా..?

| సెలబ్రిటీస్ జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి తన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీస్ కు వారికి కావాల్సిన పూజలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-08-20 08:00 GMT

సెలబ్రిటీస్ జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు స్వామి తన దగ్గరకు వచ్చిన సెలబ్రిటీస్ కు వారికి కావాల్సిన పూజలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమా వాళ్ల జాతకాలే కాదు రాజకీయ నాయకుల జాతకాలు వారి గెలుపు ఓటముల గురించి కూడా జరిగేది ఇదే అని ముక్త పథంగా చెబుతాడు వేణు స్వామి. ఐతే ఆయనకు బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం నాగ చైతన్య సమంత డైవర్స్ తర్వాతే అని చెప్పొచ్చు. నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్లిద్దరు కచ్చితంగా విడిపోతారని చెప్పాడు వేణు స్వామి. అయితే ఆయన మాటలు అప్పుడు ఎవరు పట్టించుకోక పోయినా నిజంగానే చైతన్య, సమంత డైవర్స్ తీసుకోవడంతో ఆయన వార్తల్లో నిలిచాడు. ఆయన చెప్పిందే జరిగింది అని వేణు స్వామి తన క్రేజ్ ని క్యాష్ చేసుకున్నాడు. తను చెప్పింది జరుగుతుందని ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచుకున్న వేణు స్వామి తను ఇష్టం వచ్చినట్టుగా సెలబ్రిటీస్ గురించి మాట్లడుతూ వచ్చాడు.

ప్రభాస్ గురించి ఆయన జాతకం గురించి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వేణు స్వామి. ప్రభాస్ ఫ్యామిలీ ఆయన కామెంట్స్ లైట్ తీసుకోగా వేణు స్వామి ప్రభాస్ మ్యారేజ్ గురించి.. ఆయన కెరీర్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వేణు స్వామిని భారీగానే ఎటాక్ చేస్తూ వచ్చారు. అయినా కూడా ఆయన వాటిని పబ్లిసిటీకి వాడుకున్నారు తప్ప వెనక్కి తగ్గలేదు.

ఐతే ఏపీ, తెలంగాణాలో తను చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పడకపోవడం తో కాస్త అలర్ట్ అయిన వేణు స్వామి ఇక మీదట సినీ, రాజకీయ ప్రముఖుల గురించి ప్రస్తావించనని చెప్పాడు. ఐతే మళ్లీ నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత బోర్డ్ మీద రాసుకుంటూ చైతన్య, శోభిత ఇద్దరు 3 ఏళ్లు మాత్రమే కలిసి ఉంటారని. 2027 లో వారు ఒక అమ్మాయి వల్ల విడిపోతారని చెప్పి షాక్ ఇచ్చాడు.

శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే వేణు స్వామి చేసిన ఈ డైవర్స్ కామెంట్స్ అటు అక్కినేని ఫ్యాన్స్ ను ఇటు తెలుగు ప్రేక్షకులను బాగా హర్ట్ అయ్యేలా చేశాయి. ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా వేణు స్వామిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ గా వేణు స్వామి నాగ చైతన్య, సమంత ల గురించి చెప్పా కాబట్టి దానికి రిలేటెడ్ కాబట్టి నాగ చైతన్య, శోభిత గురించి చెప్పానని దీని గురించి మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతో మాట్లాడానని.. ఇక మీదట సినిమా ప్రముఖుల గురించి మాట్లాడనని ఆమధ్య ఒక వీడియో వదిలాడు వేణు స్వామి.

ఐతే ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక స్టాండ్ తీసుకుంది. వేణు స్వామి అనే కాదు సెలబ్రిటీస్ గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది బాగా ఎక్కువైంది. అందుకే ఫిల్మ్ జర్నలిస్ట్ లు అంతా కూడా మహిళా కమిషన్ కు వేణు స్వామి మీద ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న ఆయన విచారణలో పాల్గొనాల్సి ఉంది. ఐతే ఆ తర్వాత కూడా వేణు స్వామి సతీమణి శ్రీ వాణి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఈ జ్యోతిష్యాలు అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఇవన్నీ బ్యాన్ చేయాలి కానీ దీన్ని నాంది పలికింది మీడియా వాళ్లే కదా అని ఆమె అన్నారు. సెలబ్రిటీస్ కు ప్రైవసీ లేకుండా చేస్తున్నారంటూ మీడియానే టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. తానొక సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో వేల ప్రోగ్రాంలు చేశానని ఆమె చెప్పుకొచ్చారు. మీడియా జర్నలిస్టులు చేసి ఫిర్యాదుకి ఆమె ఇలా స్పందించడం ఎవరు ఊహించలేదు. సో కాల్డ్ మీడియా అంటూ శ్రీవాణి చేసిన కామెంట్స్ మ్యాటర్ ని వేరే యాంగిల్ లోక్ తీసుకెళ్లింది.

జర్నలిస్టులు మాత్రం సోషల్ మీడియాలో నెగటివిటీ  ఎక్కువ అవుతుండటం వల్ల దానికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. నెగిటివిటీ తగ్గించడం కోసం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. కానీ వేణు స్వామి భార్య శ్రీవాణి మాత్రం రకరకాల వీడియోలు చేస్తూ వేణు స్వామి కామెంట్స్ ని ఖండించకపోగా నాగ చైతన్యని గిఫ్ట్ ఇవ్వమని అడిగింది. ఇప్పుడు అది విచారణ సమయానికి రాగా మూర్తి గారు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఒక ఆడియో ని రిలీజ్ చేసి.. నిజాలు బయట పడాలి మాకు మీ సపోర్ట్ కావాలి మాకు సూసైడే శరణ్యం అంటూ ఒక మరణ వాగ్మూలం లా వీడియో పెట్టారు. ఐతే ఈ విషయంలో వారి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు ప్రజలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు తప్ప వారిని సమర్ధించట్లేదు.

ఆల్రెడీ వీడియో రాగానే మూర్తి గారు దాన్ని పోస్ట్ మార్టం చేస్తూ వేణు స్వామి ఆయన సతీమణి శ్రీవాణికి వివరణ ఇచ్చారు. ఐతే ఇది వేణు స్వామి అండ్ టీం కావాలని డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చి వేసిన స్కెచ్ అని జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా స్పందించింది.మూర్తి గారు దీనిపై వేణు స్వామి ఆయన వైఫ్ కి కావాల్సిన క్లారిటీ ఇచ్చారు. ఇందులో మరో కోణం ఏంటంటే మూర్తి గారు వరుసగా వేణు స్వామి క్లైంట్ లను తీసుకొచ్చి లైవ్ లో కడిగిపారేస్తున్నారు. సో విషయం ఎక్కడికో వెళ్తుంది అన్న కారణంగా ఇలా మూర్తి అండ్ ఫిల్మ్ జర్నలిస్ట్ లు 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వీడియో రిలీజ్ చేసి ఉండొచ్చని విశ్లేషకులు అనుకుంటున్నారు.

ఐతే నేను 5 కోట్లు డిమాండ్ చేసింది ప్రూవ్ అయితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఛాలెంజ్ చేశారు మూర్తి. తను చనిపోయినా సరే బాడీని హాస్పిటల్ ప్రయోగాలకు ఇస్తానని.. ఒకవేళ పోయాక తన మీద ఏదైనా ఇలాంటిది ప్రూవ్ అయితే తన స్కెల్ టెన్ మీద జర్నలిస్ట్ ద్రోహి అని బోర్డ్ పెట్టండని మూర్తి చెప్పుకొచ్చారు.

అంతేకాదు వేణు స్వామి ఆయన భార్య శ్రీవాణి దిగులు పడొద్దని... వారు ప్రశాంతంగా ఉండాలని.. మీకు మీడియా సపోర్ట్ ఉంటుందని.. మా పేరు వాడుకుని మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిని పట్టించేందుకు సపోర్ట్ గా ఉంటామని వివరణ ఇచ్చారు.

Tags:    
  • Venuswamy 
  • Veenasrivani 
  • Journalistmurthy 
  • Nagachaitanya 
  • Sobhitadhulipala 
  • Prabhas 
  • Samantha 
  • Astrology 
  • Tollywood 
  • Filmindustry 
  • Journalists 

Similar News

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

Copyright @2026

Powered by Blink CMS