ఆ అధ్యక్షుడిని పట్టిస్తే 430 కోట్లు.. అమెరికా భారీ ఆఫర్..

తన దేశానికి కీడు చేస్తున్నాడని డ్రగ్స్, ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ అమెరికాలో అశాంతికి కారణం అవుతున్నాడని ఆరోపించింది.;

Update: 2025-08-08 10:30 GMT

అగ్రరాజ్యం అమెరికా ఒక దేశ అధ్యక్షుడిపై కత్తులు దువ్వుతోంది. తన దేశానికి కీడు చేస్తున్నాడని డ్రగ్స్, ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ అమెరికాలో అశాంతికి కారణం అవుతున్నాడని ఆరోపించింది. ఆ దేశ అధ్యక్షుడిపై ఇప్పటికే చాలా మండిపడుతుంది. గత బైడన్ ప్రభుత్వం, అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ అధ్యక్షుడి విషయంలో ఆగ్రహంతో ఉన్నాయి. కొన్నాళ్లుగా పంటికింద రాయిలా మారాడని వాదిస్తోంది. రీసెంట్ గా ఆ దేశ అటార్నీ జనరల్ పామ్‌బాండీ ఎక్స్ వేధికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా అధ్యక్షుడు ఆయన ఏం చేశాడని పెద్దన్న ఆరోపిస్తు్న్నాడు.

డ్రగ్స్ స్మగ్లింగ్ లో నికోలస్..

వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో. ఇతను అమెరికాలో కలకలం సృష్టిస్తున్నాడని ఆ దేశం వాదిస్తోంది. డ్రగ్స్ స్మగ్లింగ్, హింసను ప్రేరేపిస్తూ సినలో, ట్రెన్ డే అరాగువా, కార్టల్ ఆఫ్ ది సన్స్ వంటి వాటిని వినియోగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహించారు. అమెరికా, వెనెజులాకు సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆ దేశం ఆర్థికంగా ఎదిగేందుకు యూఎస్ ఎంతో కొంత సాయం చేస్తునే ఉంటుంది. కానీ అధ్యక్షుడి విషయంలోనే మండిపడుతుంది.

కొరకరాని కొయ్యగా నికోలస్

ఇటీవల నికోలస్, ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్ ను పట్టుకొని అమెరికా డ్రగ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసినట్లు బాండీ చెప్పారు. ఈ మొత్తంలో 7 టన్నుల కొకైన్ కు మదురోకు డైరెక్టుగా సంబంధాలు ఉన్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ తేల్చిందన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రధాన ఆదాయ వనరుగా మదురో భావిస్తున్నారని అమెరికా మండిపడింది. కొకైన్ తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేస్తున్నాడని మండిపడింది. మార్చి, 2020లో సౌత్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ లో మదురోపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నుంచి మదురో తప్పించుకునే ప్రసక్తే లేదని బాండీ హెచ్చరించారు.

15 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్ల వరకు..

గతంలో అంటే ట్రంప్ మొదటి సారి అమెరికా అధ్యక్షుడిగా మారిన సమయంలో నికోలస్ మదురోను పట్టిస్తే 15 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న బైడన్ 25 మిలియన్లకు పెంచింది. ఇప్పుడు దాన్ని 50 మిలియన్ డాలర్లుగా (రూ. 430 కోట్లు) చేసింది. అయితే గతంలో నికోలస్ కు సంబంధించి 700 మిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా సీజ్ చేసింది. అందులో విలాసవంతమైన భవనాలు, ప్రైవేట్ జెట్లు, వాహనాలు ఉన్నాయి.

అమెరికా ప్రభుత్వానికి నికోలస్ సవాల్ విసురుతున్నారు. బిన్ లాడన్ లాంటి వారిని పట్టుకొని చంపిన అమెరికాకు నికోలస్ కొరకరాని కొయ్యగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నామని బాండీ చెప్పారు.

Tags:    

Similar News