• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైరల్: మనసు దోచేసిన వందే...

వైరల్: మనసు దోచేసిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ వీడియో

| అలాంటి వేళలో తాజాగా కేంద్ర రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్.. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించిన ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు.

By - Tupaki Desk
Update: 2025-01-04 05:55 GMT

ఊరించేస్తోంది వందే భారత్ స్లీపర్ ట్రైన్. వందే భారత్ సిట్టింగ్ ట్రైన్ కు మించిన ఫీచర్లతో.. ఎప్పుడు వచ్చేస్తావ్ బ్రో.. వెయిట్ చేయలేమన్నట్లుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్టాలు ఎక్కేస్తుందని భావించిన వందే భారత్ స్లీపర్ ట్రైన్.. అదేమీ సాధ్యం కాలేదు. ప్రభుత్వం కొలువు తీరి దాదాపు ఆర్నెల్లు దాటిన తర్వాత కూడా ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి.

అలాంటి వేళలో తాజాగా కేంద్ర రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్.. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సంబంధించిన ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ఇందులో గంటకు 180కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ట్రైన్ మాత్రమే కాదు.. అంత వేగంలోనూ గ్లాస్ నిండుగా వాటర్ పోసి ఉంచినప్పటికి.. సదరు గ్లాస్ కదలని రీతిలో ఉండటం ద్వారా.. ఈ రైలు అంత వేగంలోనూ ఎలాంటి కుదుపులకు లోను కాదన్న విషయాన్ని మాటలతో కాకుండా.. చేతలతో చూపించారని చెప్పాలి.

కేంద్ర మంత్రి పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు పరీక్షలు నిర్వహించగా.. గరిష్ఠంగా గంటకు 180కిలో మీటర్లు దూసుకెళ్లేలా ఉండటం.. అందరి మదిని దోచేస్తోంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచనల మేరకు రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో ఈ పరీక్షను నిర్వహించారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను తొలుత గంటకు 130 కి.మీ. వేగంతో నడిపారు. ఆ తర్వాత గంటకు 140, 150, 160కు పెంచారు. తాజాగా ఈ వేగాన్ని 180కి.మీ. తీసుకెళ్లారు. పరీక్షల సమయంలో సాధారణ ప్రయాణికులు ఉంటే ట్రైన్ ఎంత బరువు ఉంటుందో.. అంతే బరువును ట్రైన్ లో ఉంచి పరీక్షలు జరిపారు.

ఈ ట్రైన్ ను విభిన్నమైన ట్రాక్ లలో పరీక్షిస్తున్నారు. ఏ ట్రాక్ లో గరిష్ఠంగా ఎంత వేగంగా ఈ ట్రైన్ దూసుకెళుతుందన్న విషయాన్ని పరీక్షిస్తున్నారు. రైల్వే వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..వందే భారత్ స్లీపర్ ను ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్లీపర్ ట్రైన్ లో మొత్తం 16 బోగీలు ఉంటాయని.. అందులో 10 బోగీలు థర్డ్ ఏసీకి.. నాలుగు సెకండ్ ఏసీకి.. ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయిస్తారు.

నాన్ ఏసీ బోగీ ఇందులో లేనట్లే. కాకుంటే.. ఈ స్లీపర్ ట్రైన్ లో సీటింగ్ తో పాటు.. లగేజ్ కోసం రెండు బోగీలు ఉండనున్నాయి. తొలుత పరిమిత రూట్లలో ఈ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చి.. దశల వారీగా వీటి సంఖ్యను పెంచనున్నారు. చివరగా.. ధరల విషయానికి వస్తే.. వందే భారత్ సిట్టింగ్ ట్రైన్ లో మాదిరే.. ఈ హై స్పీడ్ రైళ్లలో టికెట్ ధరలు సాధారణ ట్రైన్ల కంటే ఎక్కువగా ఉండటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటివరకు వీటి టికెట్ ధరలు ఎంత ఉంటాయన్న సమాచారాన్ని రైల్వే శాఖ విడుదల చేయలేదు.

Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
Tags:    
  • VandeBharat 
  • SleeperTrain 
  • IndianRailways 
  • AshwiniVaishnaw 
  • HighSpeedTrain 
  • RailwayInnovation 
  • VandeBharatTest 
  • RailwayMinister 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS