• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లైవ్‌లోనే దారుణం.....

లైవ్‌లోనే దారుణం.. టిక్‌టాక్ స్టార్‌ను కాల్చి చంపిన ఆగంతకుడు

| మెక్సికోలో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయిన వలెరియా మార్కెజ్ (23) అనే యువతిని దారుణంగా హత్య చేశారు.

By - Tupaki Desk
Update: 2025-05-15 07:53 GMT

మెక్సికోలో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయిన వలెరియా మార్కెజ్ (23) అనే యువతిని దారుణంగా హత్య చేశారు. బ్యూటీ, మేకప్ వీడియోలతో టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయిన యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగానే దారుణంగా కాల్చి చంపేశారు. గౌడలజరా నగరంలోని ఒక బ్యూటీ పార్లర్‌లో ఆమె లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా.. ఒక వ్యక్తి గదిలోకి వచ్చాడు. "వలెరియా నువ్వేనా?" అని అడిగాడు. ఆమె "అవును" అని చెప్పేలోపే, అతను ఆమె ఛాతీ, తలపై గన్‌తో కాల్చేశాడు. వలెరియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వలెరియా మార్కెజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన లైవ్ స్ట్రీమింగ్‌ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే, ఇలా లైవ్‌లో ఉండగా ఆమె హత్యకు గురికావడం అందరినీ కలచివేస్తోంది. ఆగంతకుడు నేరుగా గదిలోకి వచ్చి వలెరియాను గుర్తించి కాల్చడం చూస్తుంటే, ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలా, వ్యాపారపరమైన శత్రుత్వమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన మెక్సికోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గతంలో కూడా పలువురు సోషల్ మీడియా ప్రముఖులు దాడులకు గురైన సంఘటనలు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. పోలీసులు ఆ ఆగంతకుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గదిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వలెరియా మార్కెజ్ హఠాన్మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలుపుతున్నారు.

Mataron en una transmisión en vivo por #TikTok a la influencer mexicana #ValeriaMarquez le dio 3 disparos un repartidor y se marchó, esto sucedió en #Zapopan Jalisco.
El video del ataque 🧐 pic.twitter.com/T1QRH13mnX

— Julian (@BurgoajulianP) May 14, 2025
Tags:    
  • ValeriaMarquez 
  • TikTokStarKilled 
  • MexicoCrime 
  • InfluencerNews 
  • SocialMediaSafety 
  • JusticeForValeri 
  • LiveStreamTragedy 
  • GlobalNews 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS