లాయర్ తప్పిదం.. బిల్లుల లేమి.. గ్రీన్‌కార్డ్ కల దెబ్బతింది!

వివాహం నిజమైనదని నిరూపించడానికి ఆర్థిక సంబంధాలు అత్యంత విశ్వసనీయమైన సాక్ష్యాలుగా పరిగణిస్తారు.;

Update: 2025-10-16 17:30 GMT

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్న దంపతుల కల ఒక చిన్న నిర్లక్ష్యంతో దెబ్బతింది. వీసా ఇంటర్వ్యూకు హాజరైన ఆ దంపతుల సంబంధం “నిజమైనదే” అని అధికారి అంగీకరించినప్పటికీ వెంటనే ఆమోదం ఇవ్వలేదు. బదులుగా సామూహిక ఆర్థిక ఆధారాలు.. అంటే ఇద్దరి పేర్లతో ఉన్న విద్యుత్‌ బిల్లులు, కార్‌ లోన్‌ పేపర్లు, హౌస్‌మార్ట్గేజ్‌ డాక్యుమెంట్లు వంటి పత్రాలు సమర్పించాలని RFE (రిక్వెస్ట్ ఫర్ ఎవిడన్స్) జారీ చేశారు.

* లాయర్ తప్పు సలహా.. పెద్ద ఆలస్యం

ఆ పత్రాలు ఇద్దరి పేర్లు, ఒకే చిరునామా ఉండేలా ఉండాలి. కానీ దంపతుల లాయర్‌ వారిని అలాంటి పత్రాలు వెంట తీసుకురమ్మని చెప్పలేదట. దాంతో USCIS అధికారి ఎదుట వారు ఎలాంటి ఆర్థిక ఆధారాలు చూపలేకపోయారు. ఫలితంగా వారి అప్లికేషన్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆ లాయర్‌ తన 27 ఏళ్ల కెరీర్‌లో “ఇలాంటివి ఎప్పుడూ అడగలేదు” అని చెప్పినా ఇమిగ్రేషన్‌ నిపుణులు మాత్రం ఈ ఆధారాలు చాలా ముఖ్యమని చెబుతున్నారు.

* నిపుణుల అభిప్రాయం

వివాహం నిజమైనదని నిరూపించడానికి ఆర్థిక సంబంధాలు అత్యంత విశ్వసనీయమైన సాక్ష్యాలుగా పరిగణిస్తారు. ఫోటోలు లేదా మౌఖిక వాంగ్మూలాలు సులభంగా నకిలీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే బిల్లులు, బ్యాంక్‌ ఖాతాలు, కార్‌ లోన్లు, ఇంటి మార్ట్గేజ్‌లు వంటి పత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

* ఇతర దంపతుల అనుభవాలు

మరొకరు షేర్ చేసిన అనుభవాల ప్రకారం.. వారి లాయర్లు స్పష్టంగా “జాయింట్ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి” అని ముందుగానే సూచించారని వెల్లడించారు. కానీ ఈ దంపతులు ఆ సలహా పొందకపోవడంతో అనవసర ఆలస్యం ఎదుర్కొన్నారు.

* ఆలస్యమైన గ్రీన్‌కార్డ్ కల

ఇప్పుడు వారు కొత్తగా జాయింట్ బిల్లులు, అకౌంట్లు సెట్‌ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అవి రాబోయే వరకు కనీసం ఒక నెల వేచి చూడాల్సి ఉంటుంది.

ఈ ఆలస్యం వారికి విలువైన సమయ నష్టాన్ని కలిగించింది. సరైన లీగల్‌ గైడెన్స్‌ ఉంటే ఇప్పటికీ వారి గ్రీన్‌కార్డ్‌ చేతిలో ఉండేదని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News