అమెరికాను తాకిన ఉగ్రవాదం.. హెల్త్ క్లీనిక్ లో బాంబు పేలుడు!

ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న విషయంలో పాకిస్థాన్ కు బుద్ది చెబుతోన్న భారత్ ను (పరోక్షంగా) అడ్డుకుంది అమెరికా!;

Update: 2025-05-18 04:24 GMT

ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న విషయంలో పాకిస్థాన్ కు బుద్ది చెబుతోన్న భారత్ ను (పరోక్షంగా) అడ్డుకుంది అమెరికా! మధ్యవర్తిత్వం అని చెబుతూ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని సెట్ చేసింది! కట్ చేస్తే.. తాజాగా అమెరికాలో బాంబు పేలుడు జరిగింది. దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ)!

అవును... అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు సంభవించింది. ఇందులో భాగంగా.. పాంమ్మ్ స్ప్రింగ్స్ లోని ఓ హెల్త్ క్లీనిక్ సమీపంలో శనివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. కనీసం ఐదుగురు గాయపడ్డారు! ఈ సంఘటనపై స్పందించిన ఎఫ్.బీ.ఐ... దీన్ని ఉద్దేశ్యపూర్వక ఉగ్రవాద చర్యగా పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్... అమెరికన్ రిప్రోడక్టివ్ సెంటర్స్ నిర్వహిస్తున్న క్లీనిక్ దగ్గర స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో అనుమానిస్తున్న ఓ వ్యక్తి అధికారుల అదుపులో ఉన్నాడని పేర్కొన్నారు!

ఇదే సమయంలో... ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని చెప్పిన డేవిస్... అయితే, ఇది అంతర్జాతీయ ఉగ్రవాదమా.. లేక, దేశీయ ఉగ్రవాదమా అనేది ఎఫ్.బీ.ఐ. నిర్ణయిస్తుందని అన్నారు. ఆ ఘటన తర్వాత కనిపించిన వీడియోలో... క్లీనిక్ నుంచి దట్టమైన పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News