ఆ సంబంధానికి నిరాకరించిందని 65ఏళ్ల ప్రియురాలిని చంపిన 45ఏళ్ల ప్రియుడు
ప్రియురాలు శారీ*రక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు;
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఒళ్లు గుర్పొడిచే ఒక దారుణమైన వార్త బయటపడింది. ఇక్కడ 45 ఏళ్ల ఒక వ్యక్తి, తనకంటే 20 ఏళ్లు పెద్దదైన 65 ఏళ్ల తన ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేశాడు. ప్రియురాలు శారీ*రక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించడమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
మే 25న ప్రియురాలు మృతదేహం లభ్యం
ఈ ఘటన సరాయ్ అకిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరై గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 65 ఏళ్ల సావరి దేవి మే 25న తన ఇంట్లో మృతదేహంగా కనిపించింది. ఆమె మెడకు ఒక గుడ్డ ముక్క కట్టి ఉంది.. ఆమె దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత, అదే గ్రామానికి చెందిన దినేష్ కుమార్ సేన్‌ను మంగళవారం బసుహార్ మోడ్ సమీపంలో అరెస్టు చేశారు.
హత్యకు దారితీసిన వైనం
అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. విచారణ సమయంలో దినేష్ తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు. సావరి దేవికి పిల్లలు లేరని, పెళ్లైన 6-7 సంవత్సరాల తర్వాత ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడని దినేష్ తెలిపాడు. సావరి దేవి తన అత్తగారింట్లో ఒంటరిగా నివసిస్తుందని ఏఎస్‌పీ వివరించారు.
దినేష్ సావరి దేవికి పాలు, ఇతర అవసరమైన వస్తువులను అందించేవాడు. కాలక్రమేణా, ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వారి మధ్య శారీరక సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. దినేష్ పోలీసులకు చెబుతూ.. "నేను, సావరి దేవి తరచుగా రాత్రిపూట ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. కొన్నిసార్లు అర్ధరాత్రి నేను ఆమె ఇంటికి కూడా వెళ్ళేవాడిని. మే 23వ తేదీ రాత్రి సుమారు 10 గంటలకు నేను ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరాను. కానీ సావరి దేవి ఆరోగ్యం బాగోలేదని చెప్పి నిరాకరించింది. అది ఆమె నాటకమని నేను భావించాను" అని తెలిపాడు.
దారుణానికి పాల్పడిన ప్రియుడు
నిందితుడు దినేష్ తన దారుణాన్ని వివరిస్తూ.. "నేను ఆ రోజు ఆమెతో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాను. ఆమె నిరాకరించినా నేను బలవంతం చేయబోయాను. కానీ ఆమె నన్ను పక్కకు నెట్టివేసింది. దీంతో కోపంతో నేను ఒక గుడ్డ ముక్కతో ఆమె గొంతు నులిమి చంపేశాను" అని చెప్పాడు. అరెస్టు భయంతో దినేష్ ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కుని తన ఇంటి దగ్గర ఉన్న కాలువలో పడేశాడు. దినేష్ ఒప్పుకున్న వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సావరి దేవి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దినేష్‌ను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.