'ఉండి'.... నియోజకవర్గంలో రఘురామ గ్రాఫ్ ఏంటి... !
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం గతంలో పెద్దగా హాట్ టాపిక్ కాదు. ఎందుకంటే.. ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడూ.. మీడియాలో ఉండాలని కోరుకోలేదు.;

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం గతంలో పెద్దగా హాట్ టాపిక్ కాదు. ఎందుకంటే.. ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడూ.. మీడియాలో ఉండాలని కోరుకోలేదు. ప్రజల మధ్య ఉండాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని మాత్రమే అంచనా వేసుకుని ముందుకు సాగారు. కానీ.. గత ఏడాది ఎన్నికల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. వైసీపీ అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈ టికెట్ ఇచ్చా రు. ఆయన కూటమి హవాలో విజయం దక్కించుకున్నారు.
అప్పటి నుంచి కూడా ఉండి నియోజకవర్గం వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామ.. తీరు ఎలా ఉంది? ఆయన నియోజకవర్గం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారా? నిజాయితీ నాయకుడిగా వ్యవహరిస్తానని చెప్పుకొన్న ఆయన.. ఎలా వ్యవహరిస్తున్నారు? అనేది ఆసక్తికరం. అయితే.. ఇవన్నీఎలా ఉన్నా.. స్థానికంగా మాత్రం టీడీపీ నేతలకు కాళ్లు-చేతులు కట్టేసినట్టు పరిస్థితి మారిందన్న టాక్ అయితే..జోరుగా వినిపిస్తోంది.
అధికారులను, వ్యవస్థలను కూడా రఘురామ తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. ఇది మంచిదే. ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు ఇది కీలకం కూడా. దీనిని ఎవరూ తప్పుబట్టరు. కానీ.. కీలక నాయకులకు కూడా యాక్సస్ లేకుండా పోవడమే చిత్రమైన వ్యవహారం. అన్నీ నాకు తెలిసే జరగాలన్న రీతిలో రఘురామ వ్యవహరిస్తున్నారని.. ముఖ్య నాయకులు కూడా వాపోతున్నారు. నియోజక వర్గంలో నాయకులు పర్యటించేందుకు కూడా అనుమతులు తీసుకునే పరిస్థితి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో తనను కలుసుకునేందుకు కూడా ప్రొటోకాల్ ఉంటుందని రఘురామే స్వయంగా చెబు తున్నారు. ఇది మరీ చిత్రంగా ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకునేందుకు కూడా నియమా లు పెట్టడం ఏంటన్న చర్చ ఉంది. వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. దీనికి ఆయన రారు. ఎందుకంటే.. ప్రొటోకాల్ ఉందని అంటున్నారు. పోనీ.. ఇతర నాయకులు కార్యక్రమాలు చేపట్టాలంటే.. అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. ఇది మంచిదేనా? కాదా? అనేది తక్కువ కాలంలోనే ఎక్కువ సీనియార్టీ సంపాయించిన రఘురామకు తెలియాలి. ప్రస్తుతం అయితే.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.