తమిళనాడు పాలిటిక్స్ లో విజయ్ కొత్త చరిత్ర.. 107 మంది ఎమ్మెల్యేల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన సునామీ ఇది. కేవలం గెలవడమే కాదు, అసెంబ్లీలోకి విద్యావంతుల సైన్యాన్ని పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు.;

Update: 2026-05-11 07:34 GMT

తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన సునామీ ఇది. కేవలం గెలవడమే కాదు, అసెంబ్లీలోకి విద్యావంతుల సైన్యాన్ని పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 107 మంది ఎమ్మెల్యేలతో 'తమిళ వెట్రి కళగం' కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో చూపించబోతున్న విజయ్ టీమ్ గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం..

విద్యార్థులే నేతలుగా.. విజయ్ వ్యూహం:

సాధారణంగా రాజకీయాలు అంటే డబ్బు, అంగబలం ఉన్నవారికే టికెట్లు ఇస్తారని అనుకుంటారు. కానీ విజయ్ ఆ పాత పద్ధతులకు స్వస్తి పలికారు. సమాజంలో గౌరవం ఉన్న వృత్తుల్లో ఉన్నవారిని, బాగా చదువుకున్న యువతను బరిలోకి దించారు. ఈ 107 మంది ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే.. అందులో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఐటీలుఉండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఎమ్మెల్యేల బ్యాక్ గ్రౌండ్ : ఒక విద్యా నగరం:

విజయ్ టీమ్‌లో చదువుకున్న వారి సంఖ్య చూస్తే అది అసెంబ్లీనా లేక ఏదైనా యూనివర్సిటీనా అన్న సందేహం కలుగుతుంది. ఇక ఇందులో 22 మంది ఇంజనీర్లు, 18 మంది లాయర్లు, 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంతేకాదు, ఏకంగా 6 మంది పీహెచ్‌డీ స్కాలర్స్, 8 మంది డాక్టర్లు, 7 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్స్ కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

చదువుకున్న వారు వస్తే లాభాలేంటి?:

రాజకీయాల్లో విద్యావంతులు ఉండటం వల్ల పాలనలో నాణ్యత పెరుగుతుంది. సమస్యలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం, టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం వీరికి సులభం అవుతుంది. ముఖ్యంగా డాక్టర్లు ఉంటే ఆరోగ్య వ్యవస్థపై, ఇంజనీర్లు ఉంటే మౌలిక సదుపాయాల పైన ఒక విజన్ ఉంటుంది. ఇక వీరి వల్ల అవినీతి తగ్గి, పారదర్శకమైన పాలన వస్తుందని తమిళ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

తమిళ రాజకీయాల్లో సరికొత్త మలుపు:

గత 60 ఏళ్లుగా డీఎంకే, ఏఐఏడీఎంకే చుట్టూనే తిరిగిన తమిళ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. విజయ్ తన ఎమ్మెల్యేల ఎంపిక ద్వారా "రాజకీయాల్లోకి రావాలంటే రౌడీయిజం,డబ్బు అక్కర్లేదు.. తెలివితేటలు ఉంటే చాలు" అని నిరూపించారు. ఇక ఎక్కువగా యువతకు ప్రాధాన్యం ఇస్తూనే, విజ్ఞానానికి పెద్దపీట వేయడం విజయ్ చేసిన సాహసోపేతమైన నిర్ణయం.

విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా, తనతో పాటు ఒక మేధావుల బృందాన్ని ప్రభుత్వంలోకి తీసుకురావడం నిజంగా గ్రేట్. ఒక సామాన్య కార్యకర్త నుండి డాక్టర్ల వరకు అందరికీ అవకాశం కల్పించిన ఈ 'స్టైల్ ఆఫ్ గవర్నెన్స్' సక్సెస్ అయితే, ఇది మిగతా రాష్ట్రాలకు కూడా ఒక రోల్ మోడల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మున్ముందు విజయ్ పాలనలో తమిళనాడు ఎలాంటి అభివృద్ధి చూస్తుందో వేచి చూడాలి..

Tags:    

Similar News