ట్రంపా...గిఫ్ట్ తో కొడితే సరి...
అమ్మో ట్రంపా...మహా మొండి...సీతయ్య లెక్క...ఒక్కోసారి తనమాటతనే వినడు. ఆయనతో ఎవరూ వేగలేరు అసలే అమెరికా అధ్యక్షుడు...ఇవే కదా మనం తరచూ వింటున్నది.;
అమ్మో ట్రంపా...మహా మొండి...సీతయ్య లెక్క...ఒక్కోసారి తనమాటతనే వినడు. ఆయనతో ఎవరూ వేగలేరు అసలే అమెరికా అధ్యక్షుడు...ఇవే కదా మనం తరచూ వింటున్నది. కానీ ఎంత పక్కా లాకర్ కైనా కీ ఉన్నట్లే మన ట్రంప్ ను పడేయడానికి ఓ చిట్కా ఉంది. అదే గిఫ్ట్. అలాగని మరీ ఫలమో పుష్పమో పట్టుకెళితే కుదరదు. కుచేలుడిలా అటుకులు పట్టుకెళితే అసలుకే మోసం వస్తుంది. కాస్త కాస్ట్లీ గిఫ్టులు ఇచ్చారనుకోండి మన బాస్ కూల్ కూల్ అయిపోతాడు. ఇప్పటికే కొన్ని దేశాధినేతలు ఈ ట్రిక్ వాడేస్తున్నారు. మన ట్రంపేశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటున్నారు.
తాజాగా ఖతార్ రాజకుటుంబం ట్రంప్ మహాశయుడికి భారీ కానుక ఇవ్వడానికి రెడీ అయిపోయింది. వందల మిలియన్ డాలర్ల విలువగల విమానాన్నే సింపుల్ గిఫ్ట్ గా ఖతార్ పాలక ఫ్యామిలీ తరఫున అందించనున్నారు. ట్రంప్ దీన్ని అమెరికా అధ్యక్షుడు పర్యటనలకు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ కు ప్రత్యమ్నాయంగా వాడాలని అనుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక తొలిసారి పశ్చిమాసియాలో పర్యటించే సందర్భంగా ఖతార్ రాజ కుటుంబం ట్రంప్ కు విలాసవంతమైన 747-8 విమానన్ని బహుమతిగా అందజేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలా దీనిలో మార్పుచేర్పులు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష డెమొక్రాట్లు మాత్రం ఇది లంచావతారానికి పరాకాష్ట అని ఘాటుగా విమర్శిస్తున్నారు. ట్రంప్ 2029 జనవరిలో అధ్యక్షపీఠం దిగిపోయేంత వరకు దీన్ని వాడుతారు. ఆ తర్వాత అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్ కు అప్పగిస్తారు.
ట్రంప్ ఖాతర్ లో పర్యటించే సందర్భంగా అందించే ఈ కానుక విలువ 400 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.3400 కోట్లు. ఖతార్ రాజవంశీకులు ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులుగా ప్రసిద్ది. ఈ కానుక అందుకున్నాక ట్రంప్ ఎలా ఉబ్బితబ్బిబ్బవుతాడో చూడాల్సిందే. అయితే ఇది కేవలం లంచంగా కాకుండా అదనపు ప్రయోజన విదేశీ ప్రభావం అంటూ డెమొక్రాట్ నేత సెనెట్ మైనార్టీ లీడర్ చక్ షూమర్ ఆరోపించారు. అసలు విదేశాల నుంచి కానుకలు స్వీకరించాలంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అని రాజ్యాంగం చెబుతోందని ,ట్రంప్ దీన్ని ఖాతరు చేయడం లేదని ఘాటుగా విమర్శించారు.
అయితే ట్రంప్ కు ఇలా కానుకలు కప్పంగా చెల్లించుకున్న వారిలో యాపిల్ సంస్థ కూడా ఉంది. అమెరికాలో తయారీ పెంచాలని ట్రంప్ యాపిల్ సంస్థ పై తీవ్ర ఒత్తిడి తెచ్చాక యాపిల్ పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడికి యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రత్యేక బహుమతి ఇచ్చి చర్చకు తెరలేపారు. వైట్ హౌస్ కార్యక్రమంలో అమెరికాలో యాపిల్ తయారీ పెంచుతున్నట్లు ప్రకటించిన సందర్భంలో టిమ్ కుక్ ట్రంప్ కు అరుదైన బహుమతి అందజేశారు. ఐఫోన గ్లాస్ తో తయారు చేసిన డిస్క్ . ఈ గ్లాస్ ను 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన బేస్ మీద అమర్చారు. మధ్యలో యాపిల్ లోగో ఉంటుంది. టిమ్ కుక్ సంతకం ఉంటుంది.
అమెరికాలో తయారీ పెంచాలని డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చిన తర్వాత, యాపిల్ పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో, అమెరికా అధ్యక్షుడికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఇప్పుడు అందరిలో చర్చగా మారింది. వైట్‌హౌస్ కార్యక్రమంలో, అమెరికాలో తయారీ పెంచే దిశగా యాపిల్ తీసుకుంటున్న చర్యలను ప్రకటించినప్పుడు, టిమ్ కుక్ ట్రంప్‌కి ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. అది ఐఫోన్ గ్లాస్‌తో తయారైన డిస్క్. ఈ గ్లాస్ 24 క్యారెట్ల గోల్డ్ బేస్ మీద అమర్చారు. మధ్యలో యాపిల్ లోగో ఉంది. పై భాగంలో ట్రంప్ పేరు చెక్కించారు. కింద భాగంలో "మేడ్ ఇన్ యూఎస్ఎ" అని రాసి, 2025 సంవత్సరం చేర్చారు. దానిపై టిమ్ కుక్ సంతకం కూడా ఉంది.
రానున్న కాలంలో ట్రంప్ మహాశయుడికి ఇంకెందురు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వనున్నారో వేచి చూడాలి. అయితే అందరూ ట్రంప్ కు గిఫ్ట్ ఇస్తుంటే...ట్రంప్ రివర్స్ గేర్ లో మన ప్రధాని నరేంద్రమోదీకి గిఫ్ట్ ఇవ్వడం కొసమెరుపు