నెక్స్ట్ పోప్ గా ట్రంప్... నెట్టింట కొత్త సందడి!

ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొత్త పోప్ ఎంపిక గురించి తనదైన శైలిలో స్పందించారు.;

Update: 2025-04-30 16:30 GMT

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన 100 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫుల్ జోష్ తో కనిపించారు. ఈ సమయంలో మిచిగాన్ బయలుదేరిన సందర్భంగా విలేకరులతో తదుపరి పోప్ కావాలని కోరుకుంటున్నట్లు జోక్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అవును... రోమ్ లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొత్త పోప్ ఎంపిక గురించి తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా.. "నేను పోప్ అవ్వాలనుకుంటున్నాను" అని చమత్కరించారు. ఇదే తన నెంబర్ వన్ ఎంపిక అవుతుందని కొనసాగించారు.

ఇదే సమయంలో... తనకు ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదని చెబుతూనే న్యూయార్క్ ఆర్చ్ బిషప్ కార్డినల్ తిమోతీ డోనల్ నెక్స్ట్ పోప్ కు సూటయ్యే మంచి వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు.. చమత్కారాలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యవహారంపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో స్పందించారు. ఇందులో భాగంగా... అధ్యక్షుడు ట్రంప్ తదుపరి పోప్ కావాలనే ఆలోచనకు సిద్ధంగా ఉన్నారని తాను విని చాలా ఉత్సాహంగా ఉన్నాను అని ఆయన పోస్ట్ చేశారు. మరోపక్క ట్రంప్ వ్యాఖ్యలతో నెట్టింట సరికొత్త సందడి మొదలైంది.

ట్రంప్ వ్యాఖ్యలకు ఆయన అభిమానులు థంబ్స్ అప్ సింబల్ చూపిస్తుండగా... మరికొంతమంది సెటైర్లు పేలుస్తున్నారు. ఇందులో భాగంగా... "పోప్ సాధారణంగా ముగ్గురు వేర్వేరు మహిళలతో ఆరుగురు పిల్లలను కలిగి ఉంటారా? హహహ" అని ఒకరు ట్వీట్ చేస్తే... "దీన్ని సైకాలజీలో నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని పిలుస్తారు" అని మరొకరు స్పందించారు.

కాగా... ఈ నెలలో పోప్ ఫ్రాన్సిన్స్ మరణించిన అనంతరం సుమారు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాథలిక్ చర్చ్ సంస్థ ఆధ్యాత్మిక అధిపతి కోసం వెతుకుతోంది! ఈ నేపథ్యంలో తదుపరి పోప్ ను ఎన్నుకోవడం కోసం సుమారు 135 మంది కాథలిక్ కార్డినల్స్ త్వరలో ఒక రహస్య సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News