మునీర్ కు విందు.. 909 కి.మీ.పై ట్రంప్ బిగ్ స్కెచ్ @ వీకెండ్!
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అవిరామంగా సాగుతుంది. నేటితో యుద్ధం మొదలై వారం రోజులు కావొస్తోంది! పైగా... ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు.;
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అవిరామంగా సాగుతుంది. నేటితో యుద్ధం మొదలై వారం రోజులు కావొస్తోంది! పైగా... ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై ఇజ్రాయెల్ కు ఒక క్లారిటీ ఉన్నా.. ఇరాన్ కు ఉన్న క్లారిటీ ఏమిటో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎంట్రీ పై తీవ్ర చర్చ నడుస్తోంది.
పైగా... కాల్పుల విరమణ వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు అనేదే తమ లక్ష్యమని, అలా చేయడమే తనకు కావాల్సిన విజయమని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఖమేనీని హతమార్చితే యుద్ధం ఆగిపోయినట్లేనని నెతన్యాహు చెబుతున్నారు. ఈ సమయంలో.. పాక్ ఆర్మీ చీఫ్ కు ట్రంప్ ఇచ్చిన విందు వెనుక బిగ్ ప్లాన్ ఉందని అంటున్నారు.
అవును... ఇప్పుడు ట్రంప్ ముందున్న లక్ష్యాల్లో ఉక్రెయిన్ - రష్యా ల మధ్య సీజ్ ఫైర్ కు చర్చలు జరపడం కాదు! అంతకంటే ముందు.. ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ పై విజయం సాధించాలి. అణు ఒప్పందం విషయంలో తన మాట వినేందుకు ఇరాన్ సిద్ధంగా లేదనే విషయంపై ట్రంప్ కు ఒక క్లారిటీ వచ్చిన వేళ.. ఈ వీకెండ్ కి కానీ, నెక్స్ట్ వీక్ లో కానీ యూఎస్ ఎంట్రీ ఫిక్సని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం చేయడానికి ఆ దేశ సరిహద్దుల్లోని దేశంలో ట్రంప్ కు అనుమతి కావాలి! అలా అని సౌదీ అరేబిఉయా, కువైట్, ఇరాక్, మొదలైన దేశాల్లో ఛాన్స్ లేదు. పైగా ఆయా దేశాల్లో ఉన్న పాక్ సైనికులపై ఇరాన్ ఆర్మీతో పాటు వారికి సహకరించే ముఠాల కన్ను ఉందని ఆంటున్నారు. దీంతో.. అమెరికాకు మరో సేఫ్ ప్రత్యామ్నాయం కావాలి!
ఈ సమయంలో.. ఈ వారంతంలో కానీ, వచ్చే వారంలో కానీ ఇరాన్ పై బలంగా దాడి చేసి.. ఈ యుద్ధానికి ఒక ముగింపు ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నారని అంటున్నారు. దీంతో... ట్రంప్ కన్ను.. ఇరాన్ తో అత్యధికంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పాత మిత్రుడు, కొత్త ప్రేమికుడు అయిన పాక్ పై పడిందని అంటున్నారు.
యుద్ధ సమయంలో టెహ్రాన్ లో ఇంటెలిజెన్స్ సేకరణ, ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం. పైగా... ఇటీవల, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అమెరికా ఆధ్వర్యంలో ఉందంటూ పాక్ కు చెందిన సెక్యూరిటీ ఎనలిస్ట్ ఇంతియాజ్ గుల్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే... ఇరాన్ పై యుద్ధానికి పాక్ సరిహద్దును వాడుకోవాలని ఫిక్సైన ట్రంప్... మునీర్ కు విందు ఇచ్చారని అంటున్నారు!
వాస్తవానికి.. యుద్ధ సమయాల్లో పాకిస్థాన్ సరిహద్దులను వాడుకోవడం అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో కూడా అఫ్గానిస్థాన్లో ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఇస్లామాబాద్ ను అమెరికా అక్కున చేర్చుకొంది. కారణం... పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్తాన్ తో 2,640 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సో... ట్రంప్ విందు వెనుక అంత వ్యవహారం ఉందన్నమాట!