ట్రంప్ దెబ్బకు బంగారానికి వాపు... భారత్ కు దెబ్బ మీద దెబ్బ!
ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా... ఉక్కు, అల్యూమినియం, వాహన, వాటి విడిభాగాలు, రొయ్య, జౌళి, రత్నాభరణాలు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు మొద్లైన ఎగుమతులపై ప్రభావం కనిపించొచ్చని చెబుతున్నారు.;
భారత్ నుంచి తమదేశంలోకి వచ్చే ఉత్పత్తులపై ఆగస్టు 1 నుంచి 25% టారిఫ్ తో పాటు అదనపు పెనాల్టీ విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించి, ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యాతో భారత్ వాణిజ్యం పేరు చెప్పి ట్రంప్ ఈ పనికి పూనుకున్నారు! మరోవైపు ఇరాన్ తో పెట్రో ఉత్పత్తుల వాణిక్యం పేరు చెప్పి ఆరు భారత కంపెనీలపైనా చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ దెబ్బ బంగారంపై బలంగా పడనుందని అంటున్నారు.
అవును... భారత ఉత్పత్తులపై 25% టారిఫ్ లు విధించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా... ఉక్కు, అల్యూమినియం, వాహన, వాటి విడిభాగాలు, రొయ్య, జౌళి, రత్నాభరణాలు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు మొద్లైన ఎగుమతులపై ప్రభావం కనిపించొచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో ఆభరణాల తయారీ రంగంపై విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా.. తాజా టారిఫ్ ల ప్రభావం దేశీయ బంగారం, వజ్రాలు, ఆభరణాల తయారీ రంగంపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డే... ఈ టారిఫ్ ల వల్ల భారత్, అమెరికా దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని.. సుమారు $9 బిలియన్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్య కార్యకలాపాలపై పూర్తి ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో... భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఫియో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ స్పందిస్తూ... రష్యా నుంచి మనదేశం మిలటరీ సామగ్రి, ముడి చమురు కొంటున్నందునే, టారిఫ్ కు అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో కంపెనీల్లో అనిశ్చితి నెలకొందని పేర్కొన్నారు. అమెరికాతో విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందం కుదిరాకే అనిశ్చితి తొలగి స్థిరత్వం వస్తుందని అంచనా వేశారు.
కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ లో భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇందులో భాగంగా... ఈ సమయంలో అమెరికాకు భారత ఎగుమతులు 22.18% పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు సైతం 11.68% వృద్ధి చెంది 12.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024లో భారత్ నుంచి వెళ్లిన ప్రధాన ఎగుమతులను పరిశీలిద్దామ్..!
ఇందులో భాగంగా... 2024లో భారత్ నుంచి అత్యధికంగా వరుసగా... ఔషద ఫార్ములేషన్లు, టెలికాం సామాగ్రి, రత్నాలు, పెట్రోలియం ఉత్పత్తులు, వాహనాలు, వాహన విడిభాగాలు, బంగారు ఆభారణాలు, రెడిమెడ్ దుస్తులు, ఉక్కు ఉన్నాయి.