ట్రంప్ మనవరాలి కోసం గోడదూకేశాడు.. కట్ చేస్తే..

అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రెయస్‌ తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ నిరాకరించాడు. ప్రస్తుతం అతడు పామ్‌బీచ్‌ కౌంటీ జైల్లో $50,000 బెయిల్‌పై రిమాండ్‌లో ఉన్నాడు.;

Update: 2025-06-04 13:29 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంత నివాసమైన ‘మారలాగోలో’ గోడ దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని అధికారులు పట్టుకున్నారు. అతను చేసిన వ్యాఖ్యలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. "ప్రెసిడెంట్‌కు గాస్పెల్‌ వినిపించాలి... ఇంకా ట్రంప్ మనవరాలు కైను పెళ్లి చేసుకోవాలి" అని 23 ఏళ్ల ఆ వ్యక్తి చెప్పినట్టు పోలీస్‌ నివేదికలో పేర్కొన్నారు.

అరెస్ట్‌ అయిన వ్యక్తిని టెక్సాస్‌కు చెందిన ఆంథోనీ థామస్ రెయస్‌గా గుర్తించారు. అతడు మంగళవారం అర్థరాత్రి తర్వాత మారలాగో గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఇది అతడి తొలి చొరబాటు కాదు... గత ఏడాది డిసెంబర్‌లో కూడా అతడే ఇదే ప్రదేశంలో చొరబడినట్టు పామ్‌బీచ్‌ పోలీస్‌ విభాగం పేర్కొంది. అరెస్టు అనంతరం రెయస్‌ మాట్లాడుతూ "నేను గోడ దూకి లోపలికి వెళ్లినందుకు గల కారణం ట్రంప్‌కు గాస్పెల్‌ చెప్పడం, ఇంకా ఆయన మనవరాలు కై ట్రంప్‌ను పెళ్లి చేసుకోవడానికే నేను గోడ దూకాను" అని చెప్పాడని పోలీసులు తెలిపారు.

అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రెయస్‌ తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ నిరాకరించాడు. ప్రస్తుతం అతడు పామ్‌బీచ్‌ కౌంటీ జైల్లో $50,000 బెయిల్‌పై రిమాండ్‌లో ఉన్నాడు.

కై మాడిసన్‌ ట్రంప్‌ అనే అమ్మాయి డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ - వనేస్సా ట్రంప్‌ల కుమార్తె. అధ్యక్షుడు ట్రంప్ కు మనవరాలు. ఈ సంఘటన సమయంలో ట్రంప్‌ వాషింగ్టన్‌ డీసీలో ఉన్నారు.

ఇది మారలాగోలో జరిగిన ఇటీవలి భద్రతా ఉల్లంఘనలలో ఒకటి మాత్రమే. గత జూలై 13న ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత మారలాగో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గత ఏప్రిల్‌లో మరో మహిళ అడ్రియెన్న తజిరియన్‌ కూడా ట్రంప్‌ కుమారుడితో కలిసి భోజనం చేయాలని మారలాగోలో ప్రవేశించగా, ఆమెను కూడా అరెస్ట్‌ చేశారు.

ఈ సంఘటన మరోసారి మారలాగో భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News