• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జారి పడిన ప్రయాణికుడి...

జారి పడిన ప్రయాణికుడి కోసం వెనక్కి వెళ్లిన రైలు.. ఎక్కడంటే?

| ట్రైన్ లో నుంచి జారి పడిన వ్యక్తం కోసం సదరు ట్రైన్ వెనక్కి వెళ్లిన ఉదంతం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2025-09-03 04:30 GMT

ట్రైన్ లో నుంచి జారి పడిన వ్యక్తం కోసం సదరు ట్రైన్ వెనక్కి వెళ్లిన ఉదంతం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. అరుదుగా చోటు చేసుకునే ఈ పరిణామంలో రైల్వే తీరును అందరిని ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఆ ఆనందం ఆవిరి అయ్యేలా సదరు జారి పడిన ప్రయాణికుడు మరణించిన వైనం విషాదంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ కోడూరుకు చెందిన 35 ఏళ్ల హరిబాబు తన స్నేహితులైన మావోబాబు.. వెంకటేశ్వర్లు.. విమలరాజుతో కలిసి యలహంకలో భవన నిర్మాణ పనుల కోసం బయలుదేరారు. వీరంతా కోండవీడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జల కొండ దాటిన తర్వాత భోజనం తిన్న హరిబాబు వాష్ బేసిన్ వద్ద చేతులు కడుక్కొని.. కాసేపు గేటువద్ద నిలుచున్నాడు.

అయితే.. అదే సమయంలో రైలు భారీ కుదుపునకు లోను కాగా.. హరిబాబు ట్రైన్ లో నుంచి జారిపడ్డాడు. ఈ పరిణామాన్ని గమనించిన తోటి ప్రయాణికులు హరిబాబు స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేవారు. అప్పటికే వేగంగా ఉన్న రైలు 1.5 కి.మీ. దాటి వెళ్లిపోయింది. అయితే.. అప్పటికప్పుడు చెయిన్ లాగటంతో ట్రైన్ ఆగింది. విషయాన్ని తెలియజేయగా.. ట్రైన్ లోకో పైలెట్ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు.

వారి నుంచి అనుమతి తీసుకున్న లోకో పైలెట్ ట్రైన్ ను వెనక్కి మళ్లించారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన తర్వాత ట్రాక్ పక్కనే గాయాలతో పడి ఉన్న హరిబాబును గుర్తించారు. వెంటనే అతడ్ని ట్రైన్ లోకి ఎక్కించి ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద హరిబాబుకు చికిత్స చేసేందుకు 108 వాహనాన్ని రెఢీగా ఉంచారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేస్తున్న వేళలోనే తీవ్ర గాయాలతో ఉన్న హరిబాబు ప్రాణాలు విడిచాడు. ఈ ఉదంతం అక్కడున్నోళ్లను కలిచివేసింది.

Tags:    
  • Trainaccident 
  • AndhraPradesh 
  • IndianRailways 
  • KondaveeduExpress 
  • Breakingnews 
  • LatestNews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS