అమెరికాలో పడవ ప్రమాదం.. ఇద్దరు భారతీయ పిల్లలు గల్లంతు!

అమెరికాలో అక్రమ వలసదారులతో వెళ్తున్నట్లు చెప్పబడుతున్న పడవ ఫసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది.;

Update: 2025-05-06 11:11 GMT

అమెరికాలో ఓ విషాదరమైన పడవ ప్రమాదంలో ఇద్దరు భారతీయ పిల్లలు గల్లంతయ్యారు. ఇందులో భాగంగా... కాలిఫోర్నియాలోని శాన్ డియాగో సమీపంలో 16 మందితో ప్రయాణిస్తున్న పడవ ఫసిఫిక్ మహాసముద్రంలో తీరానికి 15 మైళ్ల దూరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఏడుగురు గల్లంతయ్యారని తెలుస్తోంది.

అవును... అమెరికాలో అక్రమ వలసదారులతో వెళ్తున్నట్లు చెప్పబడుతున్న పడవ ఫసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్నవారంతా అక్రమ వలసదారులని అంటున్నారు. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతవ్వగా... వారిలో ఇద్దరు భారతీయ పిల్లలు ఉన్నారు. వారి తల్లితండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయుల పిల్లలు గల్లంతవ్వగా.. వారి తల్లితండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడగా.. వారికి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ సహాయం చేస్తోంది. అటు అమెరికా అధికారులతో సమన్వయం చేసుకుంటుంది.

ఈ సందర్భంగా స్పందించిన అమెరికా కోస్ట్ గార్డ్... ఈ పడవకు చట్టపరమైన అనుమతి లేదని, అక్రమంగా ప్రజలను రవాణా చేస్తున్నారని పేర్కొంది. అక్రమంగా అమెరికాలో ఎంటరవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని స్మగ్లర్లుగా అనుమానిస్తునట్లు తెలిపింది.

ఇదే సమయంలో.. గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని.. దీనికోసం కోస్ట్ గార్డ్ హెలీకాప్టర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బోట్ ప్రయత్నిస్తున్నాయని కోస్ట్ గార్డ్ ప్రతినిధి, చీఫ్ పెట్టీ ఆఫీసర్ లెవి రీడ్ తెలిపారు. ఒకటి లేదా రెండు ఇంజిన్లతో కూడిన ఓపెన్ ఫిషింగ్ బోట్ ని తరచు ఇలా స్మగ్లర్లు ఉపయోగిస్తున్నారని అన్నారు.

Tags:    

Similar News