11 లక్షల కార్లను రీకాల్ చేయనున్న టయోటా.. ఎందుకంటే?

ఇంతకూ ఈ కార్లలో ఉన్న సాంకేతిక సమస్య ఏమంటే.. ఎయిర్ బ్యాగుల్లో ఏర్పడే లోపం కారణంగా సమస్యలు తలెత్తే వీలుందనన అంచనాతో రీకాల్ ప్రకటన చేయనున్నారు.

Update: 2023-12-22 03:53 GMT

కార్ల కంపెనీలకు కొదవ లేకున్నా టయోటా కార్లకు ఉండే స్పెషల్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సంస్థకు చెందిన చాలా కార్ల మోడళ్లకు గిరాకీ ఎక్కువ కావటమే కాదు.. ఈ కంపెనీ కార్లకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్లలో నెలకొన్న సాంకేతిక లోపాన్ని సరి చేయటం కోసం.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని టయోటా కార్లను రీకాల్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ సదరు కార్లలో ఉన్న లోపాలేంటి? అన్న విషయంలోకి వెళితే..

సంస్థ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2020-2022 మధ్య కాలంలో టయోటా నుంచి ఉత్పత్తి అయిన అవలాన్.. కామ్రీ.. కరోలా.. ఆర్ ఏవీ4.. లెక్సస్ ఈెష్ 250.. ఆర్ఎక్స్ 350 హైల్యాండర్.. సియన్నా హైబ్రిడ్ వాహనాల్ని తాజాగా రీకాల్ కు పిలిచింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన.. ఆయా దేశాలకు చెందిన టయోటా సిబ్బంది సంప్రదిస్తారని చెబుతున్నారు.

ఇంతకూ ఈ కార్లలో ఉన్న సాంకేతిక సమస్య ఏమంటే.. ఎయిర్ బ్యాగుల్లో ఏర్పడే లోపం కారణంగా సమస్యలు తలెత్తే వీలుందనన అంచనాతో రీకాల్ ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ కంపెనీల కార్ల యజమానులకు సందేశాన్ని పంపలేదని.. ఫిబ్రవరిలో ఈ సమాచారాన్ని బయటపెట్టే వీలుందని చెప్పాలి. ఒక్క అమెరికాలోనే 10 లక్షల కార్లలో ఈ సాంతిక సమస్య తలెత్తే అవకాశం ఉందన్న అంచనాతో సరి చేయాలనుకుంటున్నారు. కార్ల కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన వాహనాల్లో ఎదురయ్యే సాంకేతికత సమస్యల పరిష్కారానికి ఈ రీకాల్ ప్రకటన చేస్తుంటారు. అయితే.. ఇంత భారీగా గుర్తించటం.. అది కూడా టయోటా వాహనాలు కావటం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News