వరల్డ్స్ లగ్జెరీయస్ కార్లు కొనడంలో భారత్ రికార్డు.. గంటకు ఎన్ని అమ్ముడయ్యాయంటే..?

ప్రతి ఏటా దసరా, దీపావళి రాగానే మార్కెట్‌లో వినియోగదారుల హుషారు పెరుగుతుంది. కొత్త బట్టలు, ఇంటి సామగ్రితో పాటు కొత్త వాహనాలు కూడా కొంటారు.;

Update: 2025-10-08 08:03 GMT

అగ్రదేశం అధినేత ట్రంప్ సారు టారీఫ్ ల విషయంలో నోరు పారేసుకున్నాడు.. ‘భారత్ పూర్ కంట్రీ’ అంటూ వాగాడు. బహుషా ట్రంప్ కు తెలియదనుకుంటా భారత్ సత్తా ఏంటో..? లేదా అనుభవం లేకపోయి ఉండాలి.. ఇప్పుడు వచ్చింది అనుభవం. టారీఫ్ లపై చర్చిస్తామని నీళ్లు నములుతున్నాడు. ఇంతకీ ఇంత విషయం ఎందుకంటే.. లగ్జరీ కార్ల కొనుగోలులో భారత్ రికార్డు సాధించింది. భారతదేశంలో పండుగలు అంటే కేవలం భక్తి, ఆనందం, కుటుంబ బంధాల ఉత్సవమే కాదు ఆర్థిక ఉత్సాహాన్ని కూడా చూపిస్తుంది. ప్రతి ఏటా దసరా, దీపావళి రాగానే మార్కెట్‌లో వినియోగదారుల హుషారు పెరుగుతుంది. కొత్త బట్టలు, ఇంటి సామగ్రితో పాటు కొత్త వాహనాలు కూడా కొంటారు. అందుకే మార్కెట్లు పెద్ద పెద్ద ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో లగ్జరీ కార్ల విక్రయాలు ఆ ఉత్సాహాన్ని మరింత వెలిగించాయి.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా చైర్మన్ సంతోష్ అయ్యర్ ఆసక్తికరమైన గణాంకాలను వెలువరిచారు. ‘నవరాత్రుల్లో ప్రతి గంటకు 10 బెంజ్ కార్లు అమ్ముడయ్యాయి! అంటే ప్రతి ఆరు నిమిషాలకు కోటి విలువైన కారు కొత్త యజమాని ఇంటికి చేరింది. మొత్తం తొమ్మిది రోజుల్లో 2,500 కంటే ఎక్కువ లగ్జరీ కార్లను కంపెనీ డెలివరీ చేయడం, భారత మార్కెట్‌లో మెర్సిడెస్ స్థాయిని కొత్త ఎత్తుకు చేర్చింది.’ అన్నారు.

భారత ప్రభుత్వం ఇటీవల చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల లగ్జరీ కార్లపై పన్ను తగ్గింది. ఎక్స్-షోరూమ్ ధరల్లో సుమారు 6 శాతం తగ్గింపు రావడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. మరో కారణం పండుగ సీజన్‌లో ‘మంచి రోజు’కు భారతీయుల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలా మంది కొత్త వాహనాలు లేదంటే ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఈ రోజులతో ముడిపెట్టుకుంటారు.

ఒకప్పుడు బెంజ్ మధ్య తరగతి కుటుంబాలకు కేవలం కలగానే ఉండేది. ఇప్పుడు స్పీడ్ లోన్, ఫ్లెక్సిబులిటీ ఈఎంఐ, బోనస్‌లు అందుబాటులోకి రావడంతో కలలు కారు రూపంలో నిజమవుతున్నాయి. కార్లు కొనుగోలు చేసే వారు కేవలం సంపన్నులు మాత్రమే కాకుండా, తమ జీవితంలో ఒక గుర్తింపు కోరుకునే యువ ప్రొఫెషనల్స్ కూడా.

ఈ దసరా లగ్జరీ మార్కెట్‌కు ఒక కొత్త పునరుజ్జీవనాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. వినియోగదారుల విశ్వాసం, ఆర్థిక స్థిరత్వం, ఆధునిక జీవన శైలిపై భారతీయ దృక్కోణం ఇవన్నీ కలిపి ఈ ‘దసరా పిచ్చి’ని సాకారంచేశాయి. ప్రతి ఆరు నిమిషాలకు ఒక బెంజ్ అమ్ముడవడమంటే అది కేవలం వ్యాపార గణాంకం కాదు అది భారతీయ సమాజంలో మారుతున్న ఆర్థిక మానసికతకు అద్దం పట్టే విషయం.

Tags:    

Similar News